QIQ Learning Academy : చిన్నారుల ఉజ్వల భవిష్యత్ కోసం QIQ ముందుకు వచ్చింది. కేవలం మూస ధోరణిలో చిన్నారులను విద్యకు అంకితం చేయకుండా వారి IQ పెంచేందుకు ప్రయోగాత్మక విద్యను అందిస్తుంది QIQ లెర్నింగ్ అకాడమీ. న్యూ జెర్సీలోని 2509 పార్క్ ఏవ్ లో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ చిన్నారుల భవిష్యత్ తీర్చి దిద్దేందుకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ అకాడమీ సెంటర్ జనవరి 27వ తేదీ గ్రాండ్ గా ప్రారంభించారు.
ఉత్తమ విలువలు ఉన్న విద్యను అందించడంతో పాటు వీక్లీ ప్రోగ్రెస్ మానిటరింగ్, స్టడీ సెషన్లు, గ్రూప్ వర్క్, రివ్యూస్ ఉంటాయి. ప్రతీ విద్యార్థిపై స్పెషల్ ఫోకస్ పెట్టి విద్యలో ఉన్నతంగా ఎదిగేందుకు తీర్చదిద్దడమే తమ లక్ష్యం అంటూ మేనేజ్‌మెంట్ చెప్తోంది. ఒక్కో తరగతి గదిలో గరిష్టంగా 12 మంది విద్యార్థులను మాత్రమే చేర్పించుకుంటారు.
చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం పెంచేందుకు వ్యక్తిగత అభ్యాస ప్రయాణాలు తీసుకుంటున్నట్లు మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. ఇంకా విద్యార్థులకు కావాల్సిన ఇతర అంశాలను కూడా తమ అకాడమీ బోధిస్తుందని తెలిపారు. ఉత్తమమైన చిన్నారులను తయారు చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయని మరిన్ని వివరాలకు అకాడమీలో సంప్రదించాలని సూచించారు.
Breaking News