
జిల్లా: విశాఖపట్టణం
ఓటర్లు: 2.80 లక్షలు
టీడీపీ : గంట శ్రీనివాసరావు
వైసీపీ: కేకే రాజు
బీజేపీ: విష్ణుకుమార్ రాజు
Visakhapatnam Narth : ఏపీలో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఈసారి రసవత్తరంగా సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో వైసీపీ గాలి బలంగా వీచినా, ఇక్కడ సైకిల్ పార్టీ పచ్చ జెండా ఎగరేసింది. ఈసారి ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ భావిస్తున్నది. టీడీపీ కూడా కచ్చితంగా మరోసారి పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతున్నది. విశాఖలోదాదాపు 2.50 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
టీడీపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సముఖంగా లేరని సమాచారం. అయితే టీడీపీలో ఈ నియోజకవర్గంనుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. జనసేన కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నది. వైసీపీ నుంచి కూడా ఇద్దరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2019లో వైసీపీ నుంచి కేకే రాజు బరిలో నిలిచి ఓడిపోయారు. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి గంట శ్రీనివాస్ రావు విజయం సాధించారు.
ఈ సారి కూడా వైసీపీ నుంచి కేకే రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ సారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్నది. వ్యాపార వేత్తగా సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి కేకే రాజు వచ్చారు. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే వైసీపీకి బలాన్ని తీసుకొచ్చారు. దీంతో గత ఎన్నికల్లో జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం నెడ్ క్యాప్ ఏపీ చైర్మన్ గా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందకెళ్తున్నారు. సర్కారు చేపట్టిన పథకాలే గెలిపిస్తయాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ.. వైసీపీ పోటాపోటీ..
టీడీపీ అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 పీఆర్పీలో చేరి , ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కాగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరారు. భీమిలి నుంచి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచినా కొన్ని రోజుల పాటు సైలెంట్ అయ్యారు.
ప్రస్తుతం పరిస్థితులు మారుతుండడంతో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈసారి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గంటకే టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఇక్కడ టీడీపీ బలమైన క్యాడర్ ఉంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపునకు చాలా అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఊర్మిళ గజపతి రాజు పేరు కూడా వినిపిస్తున్నది. ఆమె కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గంట ఇక్కడి నుంచి పోటీకి నిరాకరిస్తే ఊర్మిళకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా టీడీపీ, వైసీపీల మధ్యే పోటీ ఉండనుంది.