
Congress : దేశమంతా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సంబరాలు జరుపుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం దానికి దూరంగా ఉంటోంది. రామమందిర నిర్మాణానికి తాము వ్యతిరేకమని చెబుతూ దూరం జరగడంతో ఏం సాధించింది. దేశ ప్రజల ఆకాంక్షలు గౌరవించని ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని దేశ ప్రజలే గుర్తించడం లేదు.
గుజరాత్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే సీజే చావ్దా తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చావ్దా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక పార్టీకి దూరమయ్యారు. దేశమంతా సంబరాల్లో మునుగుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎందుకు దూరంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. గుజరాతీలంతా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పక్షాన ఉంటే కాంగ్రెస్ మాత్రం వేడుకలను బహిష్కరించడం మూర్ఖత్వమే అని అంటున్నారు.
చావ్దా రాజీనామాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 15కు పడిపోయింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఎవరికి నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒంటరిదైపోయింది. ఊరందరిది ఒక దారి అయితే ఉల్లిగడ్డది మరోదారి అన్నట్లు కాంగ్రెస్ ఏకాగిగా నిలిచిపోయింది. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. వేడుకలను చూసేందుకు ప్రజంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బే తగలనుంది. లౌకిక విధానమని చెప్పుకుంటూ ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకపోవడంతో ఓట్లు పడే అవకాశాలు లేవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నా బాబ్రీ మసీదు కూల్చివేసింది కాంగ్రెస్ హయాంలో కాదా? అని ప్రశ్నిస్తున్నారు.