Half Day Schools : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారు లు ఆదేశాలు జారీ చేశారు.
ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణంగా ఏప్రిల్ మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి చివరి నుంచి ఎండలు మండిపోతు న్నా యి.
దీంతో పిల్లలు బయటికి రావాలంటేనే జంకే పరి స్థితి నెలకొంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్న నేపథ్యంలో ఎండల వల్ల వడ దెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.