
Hariteja changed : యాంకర్, సీరియల్ కమ్ సినిమా నటి హరితేజ. గతంలో బొద్దుగా ముద్దుగా ఉండేది. ఇప్పుడు సన్నగా మారింది. గుర్తుపట్టలేని విధంగా మారింది. చూస్తే నిజంగా షాక్ అవుతారు. తన కూతురుతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆమె కూతురుతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇప్పుడు ఆమెను చూస్తే అందరికి ఆశ్చర్యం కలగక మానదు.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే టీవీ సీరియల్లో నటించింది. తరువాత కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా చేరి ఎంతో పేరు తెచ్చుకుంది. లాక్ డౌన్ సమయంలో ప్రెగ్నెన్సీ రావడంతో కొద్ది రోజులు దూరంగా ఉంది. అప్పుడు లావుగా మారింది. ఇప్పుడు సన్నగా కావడానికి ప్రయత్నించి విజయం సాధించింది.
ఇప్పుడు బరువు తగ్గిన హరితేజ గుర్తులేని విధంగా మారిపోయింది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ కూతురుతో దిగిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అఆ, ఎఫ్ 2 వంటి సినిమాల్లో నటించి తానేమిటో నిరూపించుకుంది. ప్రస్తుతం కూడా సినిమాల్లో వేషాల కోసం చూస్తున్నా కాస్త విరామం తీసుకుని విదేశాల పర్యటనకు వెళ్లింది.
హరితేజ బాగా సన్నబడటంతో మళ్లీ సినిమా చాన్సులు వస్తాయో రావో తెలియడం లేదు. అప్పుడే బాగుండేది. ఇప్పుడు గుర్తు పట్టనంతగా మారిపోయింది. సినిమా స్టార్లు ఇలా సన్నగా కావడం కొత్తేమీ కాదు. బొద్దుగా ఉన్న వారు సన్నబడి నాజూకుగా మారుతున్నారు. అదే కోవలో హరితేజ కూడా మారిన సంగతి గమనార్హం.