37.3 C
India
Thursday, May 9, 2024
More

    Costely City : ఖరీదైన నగరంగా హైదరాబాద్.. 5 ఖండాల్లోనే బెస్ట్ ప్లేస్ దక్కించుకున్న భాగ్యనగరం

    Date:

     

    Costely City
    Costely City

    Costely City : వసతి, ఆహారం, రవాణా, దుస్తులు, గృహోపకరణాలను బట్టి కాస్లీయస్ట్ నగరం జాబితాను రూపొందించింది ఓ సంస్థ. 5 ఖండాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మన హైదరాబాద్ కు ఈ సారి చోటు లభించింది. అది ఏస్థానం అన్నది పక్కన ఉంచితే ఖండాంతరాలకు మన హైదరాబాద్ పేరు పాకుతుందన్నది సంతోషమే కాదా. భారత్ లో విదేశీయులకు కూడా అత్యంత ఖరీదైన నగరంగా ఈ సిటీ గుర్తింపు దక్కించుకుంది. దేశీయంగా చూస్తే ఈ జాబితాలో ముంబై అగ్ర స్థానాన్ని అందుకుంది. తర్వాత వరుసగా ఢిల్లీ, చెన్సై, బెంగళూర్, కోల్‌కత్తా, పూణె ఉన్నాయి. ‘మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ ఈ వివరాలను వెల్లడించింది.

    5 ఖండాల్లో 227 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆ విశేషాలను తెలుసుకుందాం..

    *ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబైకి 147వ స్థానం దక్కింది. ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూర్ 189, హైదరాబాద్ 202, కోల్‌కత్తా 211, పూణె 213 స్థానల్లో నిలిచాయి.
    *అంతర్జాతీయంగా చూస్తే వరుసగా హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ ఫస్ట్ త్రీ ప్లేస్ లను దక్కించుకుంది. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా (ఈ ఏడాది ఇది 83 స్థానాలు కోల్పోయింది). పాక్ నుంచి కరాచీ, ఇస్లామాబాద్ చోటును దక్కించుకున్నాయి.
    *ముంబైతో పోలిస్తే చెన్నై, హైదారాబాద్, కోల్‌కత్తా, పూణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువ ఉన్నాయి. ఇక విదేశీ ఉద్యోగులకు కోల్‌‌కత్తాలో అత్యంత తక్కువ ఖర్చులు ఉన్నాయి.
    *అంతర్జాతీయ ర్యాంకింగ్ లో దేశంలోని నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి. కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపా వంటి దేశాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలిచాయి.
    *విదేశాలకు కార్యకలాపాలు నిర్వహించే ఎంఎన్‌సీలకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో షాంఘై, బీజింగ్, టోకియోలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ మంచి స్థానాలని సంస్థ నివేదికలో వెల్లడించింది.
    *ఆసియాలోనే అత్యంత ఖరీదైన అగ్రగామిగా ఉన్న 35 నగరాల్లో ముంబై, ఢిల్లీ ఉన్నాయి. ఆసియా నగరాల్లో ముంబై స్థానం గతేడాదితో పోలిస్తే ఒక స్థనం తగ్గి 27వ స్థానానికి చేరింది.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...