marriage పెళ్లంటే నూరేళ్ల పంట. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుని జీవితాంతం తోడు నీడగా ఉండేదే పెళ్లి. కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా నీ చేయి విడవనని ఆ మంత్రాలకు అర్థం. దీంతో పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుంచుకుని జంటలు పది కాలాల పాటు పచ్చగా ఉండటం సహజమే. కానీ ఇటీవల పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందులో సెలబ్రిటీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
తమిళనాడులో ఆ మధ్య ఓ వివాహంలో పెళ్లి కొడుకు మిత్రులు అతడికి కాబోయే భార్యకు కొన్ని షరతులు విధించారు. వాటిని బాండ్ పేపర్ పై రాసి ఆమెతో సంతకం చేయించుకున్నారు. ఇంతకీ ఆ షరతులేమిటంటే పెళ్లయిన తరువాత వరుడిని స్నేహితులతో గడపనీయడం. వారు క్రికెట్ ఆడితే అతడు కూడా క్రికెట్ ఆడేలా సహకరించడం వంటి డిమాండ్లు ఉంచి వధువుతో సంతకం చేయించారు.
ఇప్పుడు కూడా అటాంటి సంఘటన ఒకటి జరిగింది. కానీ ఇక్కడ పెళ్లికొడుకు కాదు పెళ్లికూతురు తరఫు స్నేహితులు వరుడికి షరతులు విధించారు. అవేంటంటే తమ ఫ్రెండ్ ను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏడాదికి మూడు టూర్లు తిప్పాలి. షరతులు లేకుండా ప్రేమించాలి. వరుడు వీటిని ఒప్పుకుని సంతకం చేసిన తరువాతే పెళ్లి మంటపంలోకి వెళ్లనిచ్చారు.
ఇటీవల కాలంలో ఇలాంటి షరతులతో కూడిన వివాహాలే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. స్నేహితురాలి కోసం వారు చేసిన దానికి అందరు ఫిదా అవుతున్నారు. వరుడితో ఒప్పందం చేయించుకున్నాకే పెళ్లికి అనుమతించారు. ఇలా ఫ్రెండ్ కోసం వరుడి చేత సంతకం చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా ప్రచారం సాగుతోంది.
View this post on Instagram