Chitrangada Singh : మీ టూ ఉద్యమం సృష్టించిన సంచలనం తర్వాత ఒక్కసారిగా మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ గుట్టు విప్పారు.. అప్పటి నుండి ఎవరో ఒకరు ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతూనే ఉన్నారు. వీటిలో నిజానిజాలు తెలియదు కానీ వాటి వల్ల వార్తల్లో సెలెబ్రిటీల పేర్లు నిలిచి పోతున్నాయి.. హాట్ భామలు చేసే హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరో భామ కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేసాయి.. ఆ భామ ఎవరంటే.. బాలీవడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న చిత్రాంగద సింగ్.. ఈ బ్యూటీ కూడా తాజాగా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ..
కాస్టింగ్ కౌచ్ అంటే ఎవరు బలవంతం చేయరని.. అందుకు ఒప్పుకోవాలా వద్దా అనేది నటీమణులు నిర్ణయించుకోవాలని తనకు కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురైతే వాటిని రిజక్ట్ చేసినట్టు తెలిపింది.. ఆఫర్స్ తగ్గినప్పుడు చాలా మంది సెక్సువల్ పేపర్ కు అడిగిన వెంటనే ఒప్పకుంటారు..
అయితే అది వారి సొంత నిర్ణయం కాబట్టి దానిని ఎవరు కూడా జడ్జ్ చేయరు.. ఆమెకు నచ్చి కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకుంటుంది కాబట్టి ఎవరు ప్రశ్నించరు.. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా అడిగేవారు ఉన్నారు. ఎవరు బలవంతం చేయరు కాబట్టి మీ నిర్ణయం మీదనే ఇది ఆధారపడి ఉంటుంది.. అంటూ చిత్రాంగద సింగ్ చెప్పుకొచ్చింది.