39.2 C
India
Saturday, April 27, 2024
More

    Summer Clothes : వేసవిలో ఈ బట్టలు ధరిస్తే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న డాక్టర్లు..

    Date:

    Summer Clothes
    Summer Clothes

    Summer Clothes : రోజు రోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎండ వేడికి తట్టుకోలేక అందరూ ఇబ్బంది ఎదుర్కొంటారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతులు మరింత ఇబ్బంది పడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక వేడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా అనారోగ్యానికి గురికాకుండా ఉంటుందన్నారు.

    గతేడాది కంటే ఈ సారి వేసవి తీవ్రత విపరీతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా ఆరుబయట పనులకు వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. వేసవిలో సాధ్యమైనంత వరకు నైలాన్, సిఫాన్ దుస్తులు కాకుండా కాటన్ ధరించాలని, వేసుకున్న దుస్తులు కూడా వదులుగా ఉండేలా చూసుకోవాలన్నారు.

    ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే పనులు చేసుకోవాలని, మధ్యాహ్నం (అంటే ఎండ తీవ్రత సమయంలో) బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ద్రవ పదార్థాలైన నీరు, పండ్ల రసాలు, చెరుకు రసాలు, తదితరాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో నీటితో పాటు నిమ్మ షర్బత్, కొబ్బరి నీరు, మజ్జిగ ఎక్కువగా ఉండాలంటున్నారు. డీహైడ్రేషన్ కు గురవకుండా ద్రవ పదార్థాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.

    ఇక రాత్రి వేళలో వీలైనంత ఎక్కువ స్వచ్ఛమైన గాలి వీచే ప్రదేశాల్లో నిద్రించడం మంచిందని చెప్తున్నారు. పూర్వం గ్రామాలతో పాటు చాలా వరకు ఆరు బయట స్వచ్ఛమైన గాలిలో నిద్రించే వారు. దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్న ఈ కాలంలో ఇది సాధ్య పడేలా లేదు. కానీ ఇంటి లోపల పైకప్పు లేని ప్రదేశాల్లో మాత్రం ఆరు బయట నిద్రిస్తే మంచిదన్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    Summer : సమ్మర్ లో కార్లలో ఈ వస్తువులను అసలే ఉంచొద్దు!

    Summer : మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ...

    buttermilk : మజ్జిగ ఎప్పుడె్పుడు తాగొచ్చో తెలుసా?

    buttermilk వేసవిలో మజ్జిగ తాగుతాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుకన్నా...