36.9 C
India
Sunday, May 5, 2024
More

    India Shining : భారత్ వెలిగిపోతోంది.. భారత పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

    Date:

    India shining
    India shining, Venkaiah Naidu

    India shining : భారత్ వెలిగిపోతోంది. డెవలప్ మెంట్ లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మనదేశంలో నిర్వహించిన జీ20 సదస్సు మంచి ఫలితాలు ఇచ్చింది. ప్రపంచ దేశాలకు మన సత్తా చూపించింది. చైనా సైతం జీ 20 సదస్సును భారత్ గణనీయంగా నిర్వహించిందని పేర్కొనడమే ఇందుకు చక్కని ఉదాహరణ.

    ఈనేపథ్యంలో గురువారం దుబాయిలో జరిగిన దక్షిణ భారత వాణిజ్య పురస్కారాల ప్రదానోత్సవంలో భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత్ అంతర్జాతీయంగా ముఖ్య భూమిక పోషిస్తోంది. విదేశాంగ విధానంలో మన ప్రభుత్వం అంతర్జాతీయ సంబంధాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తోంది. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించి మన సత్తా చాటింది.

    భారత్, మధ్య ప్రాచ్య ఐరోా ఆర్థిక నడవా ఏర్పాటుకు భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా సమాఖ్యలు సంయుక్తంగా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి భారత్ లో నిర్వహించిన జీ20 సదస్సు ఓ మైలు రాయి అని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే జన్ ధన్ ఖాతాలు ప్రారంభించి వారికి చేయూత నిస్తోంది. వారి ఖాతాల్లో డబ్బులు వేస్తూ వారికి మంచి ప్రయోజనాలు కలిగిస్తోంది.

    సమర్థవంతమైన పాలన, అవినీతి రహిత పాలన మన విజయరహస్యం. ప్రజలకు చేరేలా పథకాల అమలులో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా చూసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతంది. దీనికి మన ప్రధాని చర్యలు ప్రధానం. ప్రజలకు సేవలు అందించే క్రమంలో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకుండా చూడాలని నిర్దేశిస్తున్నారు. దీంతోనే మన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి.

    ఈ ఏడాది భారత్ 750 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించింది. దీంతో సంస్కరణలు వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్త భారత్ ను వెలుగు చుక్కగా అభివర్ణించింది. దక్షిణ భారత వ్యాపార పురస్కారాలు వరించిన వాణిజ్యవేత్తలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. మునుముందు ఇలాగే ముందుకు సాగితే మన దేశం పురోగమించడం సాధ్యమేనని గుర్తు చేశారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...