Indian Medical Students :
ప్రస్తుతం ఈ అక్రిడిటేషన్ కింద ప్రస్తుతం ఉన్న 706 మెడికల్ కళాశాలలు ది వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్(డబ్ల్యేఎఫ్ఎంఈ) గుర్తింపు పొందాయి. రాబోవు పదేళ్లలో ఏర్పాటయ్యే కళాశాలలకు కూడా ఈ గుర్తింపు లభిస్తుంది. ఒక ఈ గుర్తింపుతో ప్రపంచ వ్యాప్త విద్యార్థులకు కూడా భారత్ లో మెడిసిన్ చదువుకునే అవకాశం లభిస్తుంది. దీంతో దేశంలో వైద్య విద్య మరింత నాణ్యతా ప్రమాణాలను పెంచుకునే అవకాశం లభిస్తుంది.
ఇక భారతీయ కళాశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలు సమకూరే అవకాశం ఉంటుంది. వైద్య విద్య పరమైన సహకారం అంతర్జాతీయంగా అందుతుంది. వైద్య విద్యలో నిరంతర అభివృద్ధి, ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుంది. వైద్య బోధకులు, సంస్థల్లో నాణ్యత పెరుగుతుంది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి అంకితమైన ప్రపంచ సంస్థ.
ఎడ్యుకేషన్ కమిషన్ ఆన్ ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ (ECFMG) అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రాథమిక సంస్థ, ఇది ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (IMGలు) లైసెన్సింగ్ విధానాలు మరియు నిబంధనలను పర్యవేక్షిస్తుంది.
యూఎస్ ఎంఈని తీసుకోవడానికి రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడానికి ఇండియన్ విద్యార్థులు తప్పనిసరిగా ఈపీఎఫ్ఎంజీ ద్వారా ధ్రువీకరించబడాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ సాధారణంగా మెడికల్ ప్రోగ్రాం యొక్క 2వ సంవత్సరం పూర్తయిన తర్వాత యూఎస్ దశ 1 పరీక్షకు ముందు జరుగుతుంది. ఇక విదేశాల్లోనూ పీజీ ప్రాక్టీస్ ద్వారా ఇండియన్ మెడిసిన్ విద్యార్థులకు మేలు జరగనుంది.
ReplyForward
|