Shortest Teenager : భారత్ లోనే పొట్టి వ్యక్తిగా మహ్మద్ మాజ్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదిం చుకున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇతను 18 జూలై 2023న 80 సెం.మీ అనగా 2 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 12 కిలోల బరువు కలిగి ఉన్నాడు. ఇతని వయస్సు ప్రస్తుతం 17 సంవత్సరాల 4 నెలలు.. చిన్నతనం నుంచి ఇతను మరగుజ్జు గానే ఉన్నాడు.
ప్రస్తుత వయస్సు 17 సంవత్సరాలు అయిన ప్పటికీ హైట్ ఏమాత్రం పెరగలేదు. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. పొట్టిగా ఉన్నవారు ఏం సాధిస్తారని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అలా విమర్శించే వారికి పొట్టిగా ఉన్న మేము కూడా రికార్డులు సాధించగలమని మహమ్మద్ మాజ్ నిరూపించాడు. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి దేశంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అయ్యాడు. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన మహమ్మద్ మాజ్ ను దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారు.