Hyderabad News : సినిమాల మీద పిచ్చి ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు, ఆ పిచ్చి తో ఇండస్ట్రీ లో ఎలా అయినా పైకి రావాలి అనే కసితో పనిచేసి, ఎంతో కష్టపడి స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అదృష్టం కలిసి రాక ఇంకా కృష్ణ నగర్ చుట్టూనే తిరుగుతున్నారు. పాపం వాళ్లకి వేరే పని కూడా తెలియదు, వెనక్కి వెళ్ళలేరు కూడా. అలాంటి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది దుర్మార్గులు మోసం చేసి డబ్బులు గుంజుకుంటున్నారు.
కొంతమంది అయితే అవసరాన్ని అదునుగా తీసుకొని ఆడపిల్లల మీద లైంగిక దాడులు కూడా చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక యువతి మీద అలాంటిదే జరిగింది. ప్రముఖ టీవీ షో లో అవకాశం ఇప్పిస్తాను అని మాయ మాటలు చెప్పి ఒక కీచకుడు అమాయకపు స్త్రీ మీద అన్యాయంగా లైంగిక దాడి చేసాడు. హైదరాబాద్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేసే ఒక వ్యక్తి తరచూ స్టూడియో వచ్చే అమ్మాయిల మీద ఒక కన్ను ఎయ్యడం ఒక అలవాటు. సినిమాలో పని చేసే ప్రతీ అమ్మాయికి పెద్ద ఆర్టిస్టు అవ్వాలనే కోరిక ఉంటుంది, అలా ఒక మేకప్ ఆర్టిస్టుకి కూడా కోరిక ఉండేది. తనతో రోజు బస్సులో ప్రయాణిస్తూ పరిచయం పెంచుకున్న ఆ జూనియర్ ఆర్టిస్ట్, నిన్ను కచ్చితంగా పెద్ద స్టార్ ని చేస్తాను, నాకు చాలామంది పెద్దవాళ్ళు పరిచయం ఉన్నారు. నిన్ను వాళ్ళ దగ్గరకి తీసుకెళ్లి ఒక టీవీ షో లో అవకాశం ఇప్పిస్తాను అని ఇలా ఎన్నో మాయ మాటలు చెప్పాడు. ఒక రోజు డెమో చెయ్యాలని చెప్పి, ఓయో రూమ్ ని బుక్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు.
అనంతరం తలుపులు వేసి ఆ అమ్మాయి పై అత్యాచారం చేసే దుస్సాహసం చేసాడు. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నో సార్లు ఆ అమ్మాయి పై ఈ లైంగిక వేధింపులు జరుగుతూ ఉండేవి, పెళ్లి చేసుకుంటా అని కూడా టార్చర్ చేసేవాడు, అతనికి సహాయంగా ఒక అమ్మాయి కూడా ఉండేదట. వీళ్లిద్దరి టార్చర్ రోజు భరించలేక, ఆ అమ్మాయి నేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.