
SSMB28 : అందుకే ఈయనకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.. ఇక గత ఏడాది మహేష్ సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను స్టార్ట్ చేసిన విషయం విదితమే.. ఈ సినిమా ఇప్పటికే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.
ఈ ఏడాది జనవరి నుండి షూట్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. అయితే ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చారు.. దీంతో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ లో బిజీగా ఉన్నాడు.. ఇది పక్కన పెడితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.. ఈ సినిమా టైటిల్ ఏది పెడతారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గుంటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”గుంటూరు కారం” అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు టాక్.. ఎప్పటి నుండి మరికొన్ని టైటిల్స్ కూడా వినిపిస్తున్న ఫైనల్ గా మాత్రం ఈ సినిమాకు ఇది ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మే 31న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.