AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అంతగా బలం లేకుండా పోతోంది. మొదట జనసేనతో పొత్తు కట్టిన బీజేపీ ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో కాషాయ పార్టీకి సరైన లీడర్ కనిపించడం లేదు. ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం కావడంతో మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇన్ యాక్టివ్ గా మారాడు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలోపేతం కావాలంటే ఒంటరిగానే పోటీ చేయాలని అతడి అభిప్రాయం. కానీ బీజేపీని ముందుకు నడిపించే నేత కావాలని చూస్తోంది. పార్టీని గాడిలో పెట్టే నేత కోసం గాలిస్తోంది. ఇంతవరకు అలాంటి స్థాయి నేత కనిపించలేదు. దీంతో పార్టీ వెనుకబడే ఉంది. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెబుతున్నారు.
పొత్తులు పెట్టుకుంటే పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తుందనే ప్రచారం సాగుతోంది. రాజమండ్రి బీజేపీకి బాహుబలి తానేనని నిరూపించకునే పనిలో పడిపోయారు. ఈ మేరకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. వీర్రాజు చేతలు చూసి పార్టీ నేతలే పరేషాన్ అవుతున్నారు. వీర్రాజు చేతలు అలాగే ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీకి కలిసొస్తుందా? పురంధేశ్వరి ఆధ్వర్యంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారని చూస్తున్నారు. పురంధేశ్వరికి బీజేపీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించాక కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కీలక ప్రకటనలు చేస్తూ తెరపైకి వస్తున్నారు. కానీ వీర్రాజును ఎవరు నమ్మడం లేదు. ఆయన మాటలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికి తెలియదు.