
Jagan comments on Babu and Pawan alliance: ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సభా వేధికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చుక్కల భూములను చిక్కుల నుంచి విముక్తి కల్పిస్తామని. దీని ద్వారా రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఇక ఈ భూములపై పూర్తి హక్కు రైతులకే ఉంటుందని చెప్పారు. ఈ స్థలాలను నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తామని సీఎం ప్రకటించారు. 17,476 గ్రామల్లో సర్వే చేస్తున్నాం. తర్వాత అన్నదాతలకు హక్కు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 2,06,171 ఎకరాల భూమి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.
‘రైతు బాగుంటేనే-రాష్ర్టం బాగుంటుందని భావించేది వైసీపీ ప్రభుత్వం. నాలుగేళ్లుగా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం. రైతులకు బాబు ఎంతో అన్యాయం చేశారు. ఈ భూములు రైతులకు పంచితే వారికి మేలు జరుగుతుందని కావాలనే రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు, దత్త పుత్రుడు (పవన్ కళ్యాణ్) రైతు బాంధవుల ముసుగు తొడుక్కున్నారు. ఎవరి డ్రామా వారిదే. అవి రైతులు నమ్మవద్దు.’ అంటూ జగన్ సూచించారు. చంద్రబాబుకు ఓటేస్తే ఇక ఈ పథకాలు అమలుకావని అర్థం.
పవన్ పొలిటికల్ యాక్షన్ కు బాబు స్ర్కిప్ట్ సమకూరుస్తున్నారని మండిపడ్డారు. మేము వస్తేగాని ధాన్యం కొనలేదు అంటూ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎవరు కొన్నారో చెప్పండి అంటూ సీఎం ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై జగన్ విరుచుకుపడ్డారు. రాబోయే కాలంలో మరిన్ని కల్లబొల్లి మాటలు చెప్తారు. వాటిని నమ్మి ఓటు వేస్తే పేదలు బ్రతికే పరిస్థితి ఉండదని జగన్ అన్నారు.