34.5 C
India
Monday, April 29, 2024
More

    Janasena Declare : ముందస్తు జపంలో జనసేన అధినేత.. ఆయన ఏమైనా దేవుడా అంటూ ప్రశ్నలు..

    Date:

    Janasena Declare
    Janasena Declare

    Janasena Declare : ఏపీలో పవన్ కళ్యాణ్ ముందస్తు జపం చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ మేరకు షూటింగ్ లను పూర్తి చేసుకున్న ఆయన ఇప్పుడు యాగాలు, యాత్రలపై పడుతున్నారు. అయితే ఇందులో ఒక విషయం దాగుంది. అదేంటంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ముందస్తు ఎన్నికలు వస్తాయని మాటి మాటికీ చెప్తున్నారు. దీంతో ఏపీ ప్రజలతో పాటు, రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన మాటలపై పెదవి విరుస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ ఏదో చెప్పడమే కాదు.. డిక్లేర్ కూడా చేస్తున్నాను అంటూ ప్రకటిస్తున్నారట. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు అంటూ జపం చేశారు. టీడీపీ అనుకూల మీడియానే దీనిపై రచ్చ రచ్చ చేసింది. అయితే ముందస్తు అనే పదాన్ని ఎప్పటికప్పుడు వైసీపీ ఖండిస్తూనే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అదే జపం వళ్లిస్తుండడంతో పార్టీ శ్రేణులు కూడా కొంచెం నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు రాబోతున్నాయంటూ కామెంట్స్ చేశారు.

    ముందస్తు ఎన్నికలు అనే విషయం పవన్ కళ్యాణ్ ఎలా తెలిసింది అంటూ అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం జగన్ ఆయన మంత్రి వర్గంతో నిర్వహించిన సమావేశంలో ముందస్తుకు వెళ్లేది లేదు.. ఎన్నికలు గడువు మేరకే జరుగుతాయని చెప్పారు. ఇది కూడా బాహాటంగానే ప్రకటించారు. అయినా కూడా పవన్ ఇలా మాట్లాడడం ఏంటని కొందరు మందిపడుతున్నారు.

    అసలు ఆయనకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ తో అలా చెప్పిస్తున్నాడన్న అనుమానాలు లేకపోలేదు. ముందస్తును దృష్టిలో ఉంచుకొని ‘వారాహి యాత్ర’ నిర్వహిస్తున్నారా..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం ముందస్తు లేదనడం, బాబు, పవన్ తెలంగాణతో పాటు ఎన్నికలు అనడం.. దీనికి తోడు మొన్న టీడీపీ మహానాడు, నేడు పవన్ వారాహి యాత్ర నేపథ్యంలో ప్రజలు, ఆయా పార్టీల కేడర్ తీవ్ర కన్ఫ్యూజన్ లో ఉంది.

    పవన్ కళ్యాణ్ ముందస్తు అంటూ ఏపీలో వేడి రాజేస్తున్నారా..? లేక జనసైనికుల్లో వేడి పుట్టిస్తున్నారా అన్నది ప్రశ్నగానే ఉంది. రాజకీయాల్లో అదీ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి, అలానే ప్రకటనలు కూడా ఉండాలి కానీ ఇలాంటి అసందర్భ స్టేట్ మెంట్లతో ప్రజలు, పార్టీ కేడర్ ఇబ్బంది పడుతుందని మరువద్దని రాజకీయ ఉద్ధండులు పవన్ కు సూచిస్తున్నారు.

    ముందే ఎన్నికలు వస్తే పని చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని విపక్షాలకు ఉంటుంది కానీ, పాలకపక్షంకు ఎందుకు ఉంటుంది. అయినా పవన్ హడావుడి చేస్తూ పలుచన అవుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల విషయంలోనే ఇంత గందరగోళంగా మాట్లాడుతున్న అధ్యక్షుడు మున్ముందు ఎలా మాట్లాడుతారో అని చర్చలు మొదలయ్యాయి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    Pawan Kalyan : సీఎం జగన్ పై నాకు ద్వేషం లేదు : పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: వైసిపి అధినేత సీఎం జగన్ పై నాకు వ్యక్తిగ...

    AP BJP : పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంకా గుర్రు.. ఎందుకో తెలుసా?

    AP BJP : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయనందుకు బీజేపీపై...