Journalists : అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు హైకో ర్టుకు వెళ్ళనున్నారు. ఇళ్ళ స్థలాలపై హైకో ర్టులో సీనియర్ జర్నలిస్టులు, నాన్- అక్రిడేషన్ జర్నలిస్టు లు పిటిషన్ వేయనున్నారు.ఇళ్ళ స్థలాల అవకత వల పై పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని వారు పిటిషన్ వేయనున్నారు.
కనీసం 5 సంవత్సారాల అనుభవాన్ని ప్రామాణి కంగా తీసుకుని గుర్తింపు పొందిన విలేకరులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులు కోరుతు న్నారు.ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవరించి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని వారు హైకోర్టును పిటీషన్ ద్వారా కోరనున్నారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొందిన జర్నలిస్టులను అనర్హులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.