31.3 C
India
Saturday, April 27, 2024
More

    Jr NTR : యాక్షన్ మోడ్ లో ‘దేవర’.. బిజీ షెడ్యూల్ లో యంగ్ టైగర్

    Date:

    Jr NTR :

    యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారక రామారావు నటిస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షెడ్యూల్ మేరకు రిలీజ్ కోసం మేకర్స్ వేగంగా పని చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ తో వస్తున్న మూవీ కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. తన సినిమాకు ఆస్కార్ రావడంతో యంగ్ టైగర్ బిజినెస్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యం ప్రస్తుతం వస్తున్న దేవర పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

    యంగ్ టైగర్ కు కమర్షియల్ డైరెక్టర్ తోడైతే ఇక కలెక్షన్ల వర్షం కురిసినట్లే. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ కూడా విపరీతమైన కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం దేవర సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. అయితే, ఈ మూవీ అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఆ మేరకే గతంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ లుక్ లో ఎన్టీఆర్ ను చూసిన నందమూరి ఫ్యాన్ ఖుషీ అయ్యారు.

    5 ఏప్రిల్, 2024లో రిలీజ్ అంటూ ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ పాన్ ఇండియాలో మరోసారి భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రిడెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యేందుకు కొంచెం సమయం తీసుకున్నా.. చిత్రీకరణ మాత్రం వేగంగా సాగుతుందని కొరటాల శివ దీనికి ఏ మాత్రం తగ్గడం లేదని టాక్ వినిపిస్తుంది.

    హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఫస్ట్ షూట్ చేసి ఆ తర్వాత టాకీ పార్ట్ పూర్తి చేయాలనేది  కొరటాల ప్లాన్. జులై 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మరో షెడ్యూల్ షూటింగ్ చేయనున్నారు. ఈ గ్యాప్ ను ఫిల్ చేసి యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేయాలనేది కొరటాల ప్లాన్.  ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా నటిస్తుంది. శాకుంతలంలో నటించిన అర్హ ఈ సినిమాలో కూడా కీలక రోల్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

    దేవర సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తుండగా మిక్కిలినేని సుధాకర్‌ కు చెందిన ‘యువసుధ ఆర్ట్స్‌’ అండ్ కొసరాజు హరికృష్ణకు చెందిన ‘ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌’ పతాకాలపై పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా...