Kanimozhi Karunanidhi : విద్యార్థి దశ నుంచే వారి మధ్య తారతమ్యాలుగొప్ప, పేద, వర్గం, కులం, మతం తేడాలు లేకుండా పాఠశాలలు వారికి ఒకే దుస్తులు, ఒకే భోజనం, ఒకేలా చూస్తాయి. వారి మధ్య తేడాలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక పాఠశాలలో దళిత మహిళ వంట వండిందని పిల్లలు ఆహారం తినేందుకు మొరాయించారు. విషయం తెలుసుకున్న ఎంపీ వారితో కలిసి దళిత మహిళ వండిన భోజనం తిని విద్యార్థులను దగ్గరకు తీసుకొని మంచి విషయాలు చెప్పింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.
తమిళనాడు సీఎం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించాడు. ఈ పథకానికి సంబంధించి తమిళనాడులోని ఉసిలంపాటి పాఠశాలలో 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. ఈ పాఠశాలలో స్వయం సహాయక సంఘం సభ్యురాలు దళిత మహిళ మునియసెల్వి వంట మనిషిగా పని చేస్తోంది. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు ఆమె వండిన వంటను తినవద్దని పిల్లలకు చెప్పారట. అందుకే 20 మంది విద్యార్థులు రోజూ అల్పాహారం తీసుకోవడం లేదు. ఈ విషయం కూడా ఇటీవల అధికారులు స్టాక్ ను పరిశీలించడంతో బయటపడింది. దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తాను వండిన అల్పాహారం తింటే గ్రామస్తులు వారిని తరిమికొడతారని పిల్లలు మాట్లాడుకుంటున్న తీరు చూసి బాదేసిందని మునియసెల్వి అధికారుల ఎదుట వాపోయింది. అందుకే వారు అల్పాహారం తీకోవడం లేదని చెప్పింది.
ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి అధికార పార్టీ ఎంపీ కనిమొళి చెవిలో పడింది. దీంతో స్పందించిన ఆమె ఉసిలంపాటి ప్రాథమిక పాఠశాలకు వచ్చింది. అదే దళిత వంట మనిషి వండిన అల్పాహారాన్ని స్కూలు పిల్లలతో కలిసి తిన్నారు. దీంతో ఆమెపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారితో మాట్లాడారు. డీఎంకే ఎంపీ కనిమొళి, రాష్ట్ర మంత్రి గీతాజీవన్, కలెక్టర్ సెంథిల్ రాజ్ పాఠశాలను సందర్శించారు.