35.1 C
India
Thursday, May 9, 2024
More

    Japan Review And Rating : కార్తీ ‘జపాన్’ రివ్యూ అండ్ రేటింగ్.. మూవీ ఎలా ఉందంటే?

    Date:

    Japan Review And Rating
    Japan Review And Rating

    Japan Review And Rating : ప్రతీ వారం బాక్సాఫీస్ బరిలో సినిమాలు వస్తూనే ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయి.. ముందు నుండి ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేసి థియేటర్స్ కు వెళ్లే సినిమాలు కొన్ని బోల్తా కొడితే మరికొన్ని అంచనాలను నిలబెట్టుకుని హిట్ అవుతుంటాయి.

    మరి ఈ వారం కూడా థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వచ్చాయి. వాటిల్లో ”జపాన్” ఒకటి.. కోలీవుడ్ స్టార్ హీరోల్లో కార్తీ ఒకరు.. ఇతడికి తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఎందుకంటే కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా నటించడంతో ఈయనకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

    అందుకే కార్తీ నటించిన ప్రతీ సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. మరి లేటెస్ట్ గా కార్తీ నటించిన కొత్త మూవీ ”జపాన్”.. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి జపాన్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

    కథ :

    జ[అం (కార్తీ) చిన్నప్పటి నుండి పొట్టకూటి కోసం ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు.. ఇలా దొంగగా ఉన్న జపాన్ కు తన లైఫ్ లో బిగ్ డీల్ ఒకటి దొరుకుతుంది. మినిష్టర్ ఇంట్లో డబ్బులు కొట్టేయాలి అనే డీల్ దొరకడంతో దొంగతనం చేస్తాడు.. అయితే అదే సమయంలో ఆ ఇంట్లో ఒక మర్డర్ జరుగగా ఆ హత్య చేసింది జపాన్ అని పోలీసులు తన కోసం గాలిస్తూ ఉంటారు.. మరి దీని చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది.

    విశ్లేషణ : కార్తీ ఎప్పుడు కూడా విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ ముందుకు వెళుతుంటాడు. ఈసారి కూడా జపాన్ సినిమాతో అలాంటి ప్రయోగమే చేసాడు.. రాబరీ స్టోరీని తీసుకుని ఎమోషనల్ టచ్ తో రొటీన్ గా కాకుండా కొత్తగా ఈ కథను డైరెక్టర్ తెరకెక్కించాడు.. సస్పెన్స్, కామెడీ, ఎమోషన్ అన్ని కూడా జపాన్ సినిమాలో ఉన్నాయి.. రాజమూరుగన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.. కార్తీ తప్ప మరొకరు ఈ పాత్ర చేయలేరు అనేంతలా ఈయన జీవించాడు.

    కొన్ని రాబరీ సీన్స్ అద్భుతంగా ఉన్నాయ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సస్పెన్స్ తో కథను నడిపించడం మాములు విషయం కాదు.. మధ్యలో కామెడీ, ఎమోషన్ ను కూడా చూపిస్తూ సస్పెన్స్ వీడకుండా డైరెక్టర్ కథను ఎంగేజ్ చేసిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. సాంగ్స్ అలరించక పోయినప్పటికీ బీజీఎమ్ మాత్రం అదిరిపోయింది..

    నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కార్తీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా జపాన్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్, డైలాగ్ డెలివెరీ మొత్తం కూడా కుమ్మేసాడు.. అను ఇమ్మాన్యుయేల్ తన పాత్రకు న్యాయం చేసింది. సునీల్ కూడా కీలక రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు.

    టెక్నీకల్ పరంగా చుస్తే.. డైరెక్టర్ తెరపై తాను అనుకున్న కథను అద్భుతంగా చూపించి ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ కామెడీ యాక్షన్ మూవీని ఒకేసారి చూపించేసాడు. జివి ప్రకాష్ సంగీతం ఆకట్టుకోక పోయినప్పటికీ బీజీఎమ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.. ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి..

    ప్లస్ పాయింట్స్ :

    కార్తీ నటన
    డైలాగ్స్
    స్క్రీన్ ప్లే
    డైరెక్షన్
    కొన్ని సీన్స్ లో బీజీఎమ్

    మైనస్ పాయింట్స్ :

    రొటీన్ కథ
    సాంగ్స్
    కొన్ని సీన్స్ లో లాగ్

    రేటింగ్ : 2.75/5

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    హీరో సూర్య కుటుంబం ముక్కలైంది

    తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబం ముక్కలైంది. హీరో సూర్య ,...