High mileage Cars : పర్ఫార్మెన్స్ సెంట్రిక్ కార్లు పవర్ ఫుల్ ఇంజిన్లు, ఏయిరో డైనమిక్ డిజైన్ తో ఉన్న టాప్ ఎండ్ మోడల్ కార్లు మార్కెట్ లో ఉన్నాయి. అయినా హ్యుందాయ్, మహీంద్రా, టాటా మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా మంచి ప్రైజ్ తో మార్కెట్లలో మంచి ప్లేస్ ఆక్రమిస్తున్నాయి. i20 ఎన్ లైన్, వెన్యూ ఎన్ లైన్‌కు ప్రసిద్ధి చెందిన హుందాయ్ మోటార్స్ ఇండియా, క్రెటా ఎన్ లైన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది.
వెర్నా స్పోర్టియర్ ఎన్ లైన్ వెర్షన్ ఈ సంవత్సరం చివరలో వచ్చే అవకాశం ఉంది. ఇంతలో, టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్..
టాటా ఆల్ట్రోజ్ రేసర్ -2023 ఆటో ఎక్స్‌పో దాని తర్వాత భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2024లో దీన్ని ఆవిష్కరించారు. శక్తివంతమైన 1.2L, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120bhp పవర్ అవుట్ ఫుట్, 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది హుందాయ్ i20 ఎన్ లైన్‌తో పోటీపడనుంది. బానెట్‌పై రేసింగ్ గీతలు, బ్లాక్ అవుట్ హెడ్ ల్యాంప్స్, బ్లాక్ అవుట్ రూఫ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్పెషల్ రేసర్ బ్యాడ్జి వంటి స్పోర్టీ ఎలిమెంట్స్‌తో ఆల్ట్రోజ్ రేసర్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. కొత్త 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 7.0 అంగుళాల ఇన్ స్టుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైర్, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్, ఇతర పనితీరు సెంట్రిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో ఇంటీరియర్ సమానంగా స్పోర్టీగా ఉన్నాయి.
హుందాయ్ క్రెటా ఎన్ లైన్..
హుందాయ్ క్రెటా ఎన్ లైన్ ను స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇది కిన్నింటిలో క్రెటా నుంచి వేరు చేస్తుంది. ప్రత్యేకమైన ఫ్రంట్ గ్రిల్, పియానోబ్లాక్ ఫినిషింగ్ సరౌండ్‌తో కూడిన హెడ్ ల్యాంప్‌లు, ఫాక్స్ బ్రస్ట్‌డ్ అల్యూమీనియంతో కూడిన పెద్ద ఎయిర్ ఇన్‌లెట్లు, అప్ డేట్ చేసిన బంపర్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ప్రత్యేక ఎగ్జాస్ట్ చిట్కాలతో పాటు సైడ్ స్కర్ట్, బ్యాక్ బంపర్‌పై ‘ఎన్ లైన్’ బ్యాడ్జింగ్ ఉంది. క్రెటా ఎన్ లైన్ ఇంటీరియర్‌లో రెడ్ యాక్సెంట్లు, ఎక్స్‌క్లూజివ్ ఎన్ లైన్ బ్యాడ్జింగ్, స్పోర్టీ అప్హోల్ట్సరీ ఉంటాయి. ఇది డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 160bhp, 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
హ్యుందాయ్ వెర్నా ఎన్ లైన్..
హుందాయ్ వెర్నా ఎన్ లైన్ కూడా దేశంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించి అధికారిక వివరాలు తెలియరాలేదు. అయితే, ఇది మార్కెట్ లోకి వస్తే, 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో 160bhp, 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.