
Lavanya Tripathi :
నిన్న వినాయక చవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా పూజలు మిన్నంటాయి.. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గణపయ్యను ప్రతీ ఊరు కొలుస్తూ పూజలు చేస్తున్నారు.. సామాన్యులే కాదు సెలెబ్రిటీల ఇళ్లల్లో కూడా గణపతి సంబరాల సందడి మామూలుగా లేదు.. తమ ఇళ్లల్లో వినాయకుడిని పెట్టుకుని పూజలు జరిపించి సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకున్నారు.
ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మెగా ఫ్యామిలీ కూడా గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకుంది.. చిరు ఫ్యామిలీ కొత్తగా వారింట్లోకి వచ్చిన మెగా ప్రిన్సెస్ తో వినాయక చవితి సంబరాలు జరుపుకోగా.. నాగబాబు కుటుంబం తమ ఇంట్లోకి కొత్తగా రాబోతున్న కోడలు లావణ్య త్రిపాఠితో వేడుకలు జరుపుకున్నారు.
పూజ అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వేడుకలకు సంబంధించిన పిక్స్ షేర్ చేయడంతో లావణ్య కూడా ఈ వేడుకల్లో పాల్గొంది అని అర్ధం అయ్యింది.. నాగబాబు ఆయన సతీమణి, వరుణ్ ఆయనకు కాబోయే సతీమణితో దిగిన పిక్స్ నెట్టింట తెగ షేర్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ కొత్త జంట ఎంగేజ్మెంట్ జరుపుకోగా అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న.
మరి ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్లి అవ్వడమే అని లావణ్య అప్పుడే అత్తారింట్లో తన మొదటి పండుగను జరుపుకుంది.. ఈ వేడుకల్లో అమ్మడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.. లావణ్య త్రిపాఠీ ట్రెడిషనల్ డ్రెస్ శారీలో సందడి చేసింది.. ఈ వేడుకల్లో నిహారికకు మిస్ అవుతున్నట్టు వరుణ్ తెలిపారు..
మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలపై తమ ఆనందాన్ని తెలుపు తున్నారు. జూన్ లో ఎంగేజ్మెంట్ జరుగగా నవంబర్ 1న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది.. ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుండగా అతి కొద్దీ మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.