
Mahesh Namrata : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం చాలా మందికి తెలిసిందే.. కలిసి సినిమాలు చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడడం ఆ పరిచయం కాస్త పెళ్లి వరకు దారి తీయడం చాలా మందికి చూసాం.. అయితే అందరికి వారు పెద్ద వారు ఒప్పుకోరు. కొంతమంది పెద్దవారిని ఒప్పించి చేసుకుంటే మరికొంత మంది వారికీ వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటారు.
ఎలా చేసుకున్న పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండే జంటల కంటే విడిపోయే జంటలనే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం.. అయితే ఎంతో అన్యోన్యంగా ఇప్పటికి ఎటువంటి మనస్పర్థలు లేకుండా ఉంటున్న జంటల్లో మహేష్ బాబు, నమ్రత జంట ఒకటి. ఈ జంట పెళ్లి జరిగి పుష్కరకాలం గడిచి పోయిన ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
వీరు వంశీ సినిమా చేసే సమయంలో ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే నమ్రత హిందీలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. కానీ మహేష్ అప్పుడప్పుడే సినిమాలు చేస్తున్నాడు. అయిన వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికి అన్యోన్యంగా కలిసి ఉన్నారు. ఇది పక్కన పెడితే ఈ జంట ప్రేమ పెళ్ళికి కారణం మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అని తెలుస్తుంది. మహేష్ పెళ్ళికి ముందు కృష్ణ ఒప్పుకోలేదట..
కృష్ణ గారు మహేష్ ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.. కానీ నమ్రత ముంబైకు చెందినది కావడంతో వీరి పెళ్ళికి ఒప్పుకోలేదని కానీ మహేష్ నమ్రతను మర్చిపోలేక ముంబైకి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నారట.. దీంతో కృష్ణ మహేష్ మీద సీరియస్ అవ్వడంతో ఇందిరా దేవి గారు కూర్చుని ఆయనను ఒప్పించారట.. అప్పుడు ఈయన ముంబైకు వెళ్లి ఈ జంటను ఆశీర్వదించారు..