
Mangal bath with beer : ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన రావడం మంచిదే. కానీ అది అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అంతేకాని మనం చేసే పని ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు. అందరు మెచ్చుకునేలా పనులు చేయడం అందరికి సాధ్యం కాదు. కొందరికి వెర్రి ఉంటుంది. దీంతో వారు ఏం చేస్తున్నారో అర్థం కాదు. నవ్వుల పాలు చేసే విధంగా ప్రవర్తిస్తుంటారు.
తాజాగా నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. పెళ్లిలో వరుడికి మంగళస్నానాలు చేయిస్తుంటారు. అది పసుపు నీళ్లతో చేయించడం మనకు తెలుసు. కానీ ఇక్కడ వరుడి స్నేహితులు ఓ వింత ఆలోచన చేశారు. వరుడికి బీరుతో స్నానం చేయిస్తే ఎలా ఉంటుందని వినూత్న రీతిలో ఆలోచించారు.
ఇంకేముందు దాన్ని ఆచరణలో పెట్టారు. వరుడికి బీరుతో స్నానం చేయించారు. దీంతో అతడి శరీరం మొత్తం బీరు వాసన రావడం గమనార్హం. అతడి స్నేహితులు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు. వారి ఆలోచనను కార్యరూపంలో పెట్టడం వివాదాలకు దారి తీసింది. అలా పెళ్లి కొడుకును బీరుతో నింపడం గమనార్హం.
వరుడిని బీరుతో నింపి అతడికి ముప్పు కలిగేలా చేశారు. పెళ్లికి వచ్చిన వారికి వరుడి నుంచి వచ్చే వాసనకు అందరు బలి అయ్యారు. ఇలా పెళ్లి వేడుకలో వరుడి భవిష్యత్ కు భంగపాటు కలిగించిన స్నేహితులను అందరు తిట్టుకున్నారు. వరుడికి బీరుతో స్నానం చేయించడమేమిటని అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్వాకాన్ని అందరు తప్పుబడుతున్నారు.