27.8 C
India
Sunday, May 28, 2023
More

    మార్చి 23 2023 రాశి ఫలితాలు

    Date:

    March 23 2023 Horoscope
    March 23 2023 Horoscope

    మేషం

    ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

    —————————————

    వృషభం

    స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి.

    —————————————

    మిధునం

    ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

    —————————————

    కర్కాటకం

    గృహమున సంతాన శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.

    —————————————

    సింహం

    దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్పఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

    —————————————

    కన్య

    నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

    —————————————

    తుల

    చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

    —————————————

    వృశ్చికం

    అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగమున దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

    —————————————

    ధనస్సు

    ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

    —————————————

    మకరం

    వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.

    —————————————

    కుంభం

    బంధు మిత్రులతో మాటపట్టింపులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

    —————————————

    మీనం

    నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా  సాగుతాయి.

    Share post:

    More like this
    Related

    Surekhavani : మరో పెళ్ళికి సిద్ధం అవుతున్న సురేఖావాణి.. అందుకే అలాంటి ట్వీట్ చేసిందా?

    Surekhavani : ఇప్పుడు పవిత్ర లోకేష్ - నరేష్ ల జంట ఎంత...

    Late Marriages : ఆలస్యంగా పెళ్లిళ్లతో సంతాన సమస్యలు

    late marriages : ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కెరీర్...

    Eating Curd : ఎండాకాలంలో పెరుగు తింటే వేడి చేస్తుందా?

    Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ...

    President plane : అరెయ్.. ఏంట్రా ఇదీ.. అధ్యక్షుడి విమానంతోనే ఆటలు

    President plane : అది అద్యక్షుడి విమానం. విమానంలో ఆయన లేరు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఈ ఐదు రాశుల వారికి కనక వర్షమే తెలుసా?

    Five zodiac signs : జ్యోతిష్యం ప్రకారం మనకు నక్షత్రాల ప్రకారం...

    శని దేవుడి ప్రసన్నం కోసం ఏం చేయాలో తెలుసా?

    మన జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాశులుంటాయి. ప్రతి రాశిలో శని సంచరిస్తుంటాడు....

    ఏప్రిల్ 18th 2023 రాశి ఫలితాలు

    మేషం చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల...

    ఏప్రిల్ 17th 2023 రాశి ఫలితాలు

    మేషం బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. చేపట్టిన...