
YCP in AP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల తీరు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తు్న్నది. మరి ముఖ్యంగా గుడులు, బడులు అనే తేడా లేకుంటే అన్నింటికి ఆ పార్టీ జెండా రంగులు వేస్తూ ప్రజలు ముక్కున వేలేసుకునేలా చేస్తు్న్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు కూడా తమ పార్టీ రంగులు వేసుకుంటున్నారని పచ్చ పార్టీ నేతలు ఎద్దేవా చూస్తున్నారు.
తాజాగా ఏమైందంటే..
తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర జరుగుతున్నది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం పూల తోరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే పూల అంకారం వైసీపీ జెండా రంగులు పోలిన పూల మధ్యలో జే అనే అంగ్ల అక్షరం, తుపాకి బొమ్మ డిజైన్ తో పెట్టారు. ఇదే ప్రస్తుతం విమర్శలకు కేంద్ర బిందువైంది. అన్ని పార్టీల నాయకులు దీనిపై మండిపడుతున్నారు. మరి ఇంత స్వామి భక్తి సరికాదని అంటున్నారు. ఆలయాలపై కూడా జగన్ పై అభిమానాన్ని చూపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధైవసన్నిధిలో ఇదేం సంస్కృతి అని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జే అనే అక్షరంతో ఆలయానికి ఏం సంబంధమని ట్వీట్ చేశారు. జే గ్యాంగ్ బరితెగింపు మరి ఈ స్థాయిలో ఉందని టీడీపీ యువనేత లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ నేతల తీరు సరికాదని, దేవాలయంలో జగన్ పై భక్తి చాటుకోవడం సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.