34.5 C
India
Monday, May 6, 2024
More

    Netizens Request : ఏపీ సీఎం జగన్ ఏం అడిగారో కూడా చెబుతారా..? ప్రధానికి నెటిజన్ల విన్నపం

    Date:

    Netizens Request :
    తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అంతరంగిక సమావేశాల్లో కేసీఆర్ చర్చించిన అంశాలను కూడా ప్రధాని వెల్లడించారు. ఎన్డీఏలో చేరుతానని, తన కుమారుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అడిగినట్లుగా ప్రధాని ప్రకటించారు. అయితే ఇప్పుుడు దీనిపైనే ఏపీలో జోరుగా చర్చ నడుస్తున్నది.

    తెలంగాణ సీఎం కేసీఆర్ సరే.. మా సీఎం జగన్ ఏం అడుగుతున్నారో చెప్పండి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. అపాయింట్ మెంట్ల కోసం కష్టపడి మా సీఎం జగన్ మిమ్మల్ని కలుస్తున్నారని, ఇంతకు ఏం అడుతున్నారో చెప్పాలని కోరుతున్నారు. తనపై అక్రమాస్తుల కేసు మాఫీ, వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు తగ్గింపు గురించే అడుగుతున్నారా అంటూ ప్రశ్నిస్తు్న్నారు. రాజధాని, పోలవరం తాకట్టు, రాష్ర్ట ప్రయోజనాలు గాలికి.. ఇలా ఎన్నో విషయాలు మీతో చర్చించారా అంటూ అడుగుతున్నారు. మరి ఏపీ సీఎం జగన్ కూడా ఎన్డీఏలో చేరాలని అనుకుంటున్నారా.. లేదా ప్రధాని చెప్పాలని కోరుతున్నారు. మీకు తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే ఏపీ సీఎం జగన్ దగ్గరని అనుకుంటున్నామని, కొంత మా రాష్ర్టం గురించి ఏదైనా అడిగారేమోనని తెలుసుకోవాలని అనుకుంటున్నామని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

    అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం నెలకోసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వస్తుంటారు. ఇప్పుడైతే ఆయన పై ఉన్న కేసులన్నీ ఆటకెక్కాయి. ఏకంగా పదేళ్లు బెయిల్ పై ఒక నిందితుడు ఉన్నాడంటే మన న్యాయవ్యవస్థను ఎంతలా మేనేజ్ చేస్తున్నారో అర్థం అవుతున్నదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్ర పెద్దల సహకారం లేనిదే ఇలాంటివి జరగవని, ప్రధాని మోదీకి అంతా తెలుసనని వారు భావిస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ మీ దగ్గర తాకట్టు పెట్టిన రాష్ర్ట ప్రయోజనాలను కూడా ఏపీలో నిర్వహించే బహిరంగ సభల్లో చెప్పాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...