Nia Sharma Hot Look :
హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు మత్తెక్కించడంలో నియా శర్మ ముందుంటుంది. బాలీవుడ్ కు చెందిన ఈ అమ్మడు టెలివిజన్ సీరియల్స్ లో లీడ్ రోల్ చేస్తూ ఇప్పుడిప్పుడే వెండితెరకు వస్తుంది. హీరోయిన్స్ కు ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను చేస్తుంది.
17 సెప్టెంబర్, 1990లో దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. సినిమాల్లోకి రావాలని కలలు కంది. అనుకున్నట్లుగానే ఆ రంగంలో విశేషంగా ఆకట్టుకుంటుంది.
స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే ‘కాళీ-ఏక్ అగ్ని పరీక్ష’ తో 2010లో బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించింది నియా శర్మ. తర్వాత అదే చానల్ లో వచ్చిన మల్టీ స్టారర్ బెహెనేన్ లో కూడా నటించి మెప్పించింది.
ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న నియా శర్మ. వెండితెరపై మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అందుకే ఆమెను బుల్లితెర క్వీన్ అని పిలుచుకునేవారు.
మోడలింగ్ నుంచి వచ్చిన నియా. ప్రముఖ వీడియో సాంగ్ లలో నటించింది. తర్వాత స్టేజీ షోలు, సీరియల్స్, వెబ్ సిరీస్, సినిమాలు ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది.
కానీ ఆమెకు వెండితెర మాత్రం అంతగా కలిసి రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తప్ప, ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించింది లేదు.
రీసెంట్ గా ఆమె వైట్ డ్రెస్ లో తన అందాలను చూపించి కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో ఫొటోలను యూత్ తెగ షేర్ చేస్తుంది.
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆమె ఇంకా తనదైన ముద్ర వేయకపోయినప్పటికీ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఆమె ఫోటోలు దక్షిణాదికి చెందిన దర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.