
మరి ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ సినిమాల ద్వారా బాగానే వెనకేసింది. కోట్లు సంపాదించి ప్రస్తుతం లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది.. అయితే అలాంటి విద్యాబాలన్ బెగ్గర్ గా మారింది.. ఎందుకు ఏంటి అనేది తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవాల్సిందే..
తాజాగా విద్యాబాలన్ నీయత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. తాను గతంలో ఒక సారి బెగ్గర్ గా నటించానని తెలిపింది. ఐఎంజి అనే భారతీయ సంగీతం బృందం తరపున ప్రతీ ఏడాది కచేరీలు చేస్తారు.. ఈ ప్రోగ్రాం మూడు రోజులు ఉంటుంది.
దీనికి తాను కూడా వాలంటీర్ గా పని చేసానని.. అయితే ఒకసారి ఒక ఛాలెంజ్ రావడంతో బెగ్గర్ గా నటించాను అని తెలిపారు. ఆమెను ఒక కాఫీ షాప్ కు వెళ్లి భోజనం కావాలని తలుపు తట్టమని చెప్పగా సరే అని నేను వెళ్ళాను.. అలా డోర్ కొడితే ఎలా చిరాకు పడతారో తెలుసుగా.. వారు నన్ను చూసి అలాగే చిరాకు పడ్డారు.. ప్లీజ్ ఆకలిగా ఉంది నిన్నటి నుండి ఏమీ తినలేదు అని డోర్ కొడుతూనే ఉన్నాను.. చివరకు ఈ పందెంలో నేను గెలిచాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
ReplyForward
|