38.9 C
India
Tuesday, April 30, 2024
More

    17 Marriages : ఒకే కుటుంబం.. ఒకేసారి 17 మందికి పెళ్లి!

    Date:

    17 Marriages
    17 Marriages

    17 Marriages : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ ఈ సామెత అందరికీ గుర్తిండే ఉంటుంది. ఇల్లు అనేది ఎంత ఖర్చు, బాధ్యత, బరువుతో కూడుకున్నదో పెళ్లి కూడా అంతే. పెళ్లి చూపుల నుంచే ఖర్చు మొదలవుతుంది. గతంలో పెళ్లిళ్లు ఇళ్ల ముందు సాదాసీదాగా చేసేవారు. ఇరుగు పొరుగువారు కూడా సహకరించేవారు. అన్నీ తామై చూసుకునేవారు. బంధువుల కంటే కూడా ఇరుగు, పొరుగువారే ఎక్కువ బాధ్యత తీసుకునేవారు.

    అప్పుడు వీధులతో పాటే మనసులు కూడా విశాలంగా ఉండేవి. కానీ ఇప్పుడు వీధులు ఇరుకుగా.. మనసులు కూడా ఇరుకుగానే మారిపోయాయి. అందుకే పెళ్లిళ్లు ఫంక్షన్ హాళ్లకు వెళ్లిపోయాయి. ఒక ఇంట్లో వివాహ తంతు ఉందని ఇరుగు పొరుగు వారికి కూడా తెలియకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది పెళ్లిళ్లు నిర్వహించడం మామూలు విషయం కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఒక పెద్ద మనిషి. ఆ వివరాలు చూద్దాం.

    రాజస్థాన్ కు చెందిన సూర్జారమ్ గోదారా అనే వ్యక్తి తన ఇంట్లో 17 మంది మనుమలు, మనవరాళ్లకు ఒకేసారి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి పెళ్లి వేడుక నిర్వహించాలనుకున్నారు. పెళ్లికి ఒకే పత్రికను ముద్రించి బంధు, మిత్రులకు పంచారు.

    రాజస్థాన్, బికనీర్, నోఖా మండలంలోని లామ్ దేసర్ గ్రామానికి చెందిన సూర్జారామ్ గోదారాకు పెళ్లీడుకు వచ్చిన ఐదుగురు మనమలు, 12 మంది మనమరాళ్లు ఉన్నారు. ఏప్రిల్ 1న వీరి పెళ్లి జరిగింది. మనమళ్లందరికీ ఒక రోజు మనుమరాళ్లకు తర్వాతి రోజు ముహూర్తాలు పెట్టాడు. రెండు రోజుల పాటు పెళ్లి తంతు జరిగింది. ఈ వేడుకను చూసేందుకు బంధువులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు.

    Share post:

    More like this
    Related

    Sontham Heroine : సొంతం హిరోయిన్ ..  40 ఏళ్లు వచ్చినా ఇంత హాట్ గానా..

    Sontham Heroine : తెలుగులో 2002లో సొంతం సినిమా వచ్చింది. ఆర్యన్...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    Weather Report : వర్షాలపై వాతావరణ శాఖ తీపి కబురు

    Weather Report : దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి...