
Daddamma : వర్మ.. ఈయన కాంట్రవర్సీకి మారుపేరు అని చెప్పాలి.. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని ఒకప్పుడు చెప్పుకునే వారు.. కానీ ఇప్పుడు వివాదాస్పద డైరెక్టర్ అని చెబుతున్నారు.. ఈయన ఎప్పుడు కూడా తనకు సంబంధం లేని విషయాలపై కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు.. ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ కారణంగా చిక్కుల్లో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.
మంచి సినిమాలు తీయడం మానేసిన వర్మ ఇప్పుడు కాంట్రవర్సీలు చేస్తూ బ్రతికేస్తున్నాడు.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వర్మ చేసిన కామెంట్స్ మరింత వివాదం అయ్యాయి.. ఇటీవలే పవన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద పాపం పసివాడు అనే సినిమా ఎవరైనా తీస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే..
ఈ ట్వీట్ పైనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆ సినిమా ఎవరితో కాదు.. నీతో తీయాలి.. అజ్ఞాతంతో కూడిన అమాయకత్వం.. అమాయకత్వంతో కూడిన దద్దమ్మగా ఉన్నందుకు.. మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ తో బాధపడుతున్న అనేక పాత్రలుగా కనిపించేలా నిన్ను తీర్చి దిద్దాలి.. నీ మీద ఈ సినిమా తీస్తే నేను సంతోషిస్తాను అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసారు..
అంతేకాదు.. పవన్ పేరును ట్యాగ్ చేస్తూ.. నువ్వు ఎంజీఆర్ కాదు.. ఎన్టీఆర్ కాదు.. అసలు నీకు ప్రజాసేవ అన్న పదాన్ని పలికే అర్హత కూడా లేదు.. ప్రజాసేవ అనే ముసుగులో అమాయకపు అభిమానులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్న నీ నిజస్వరూపాన్నీ మీ జనసైనికులు తెలుసుకుని నీకు దూరం అవుతారు అంటూ రెచ్చిపోయాడు.. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్మపై ట్రోల్స్ చేస్తున్నారు.. జగన్ ఎంత ఇచ్చాడు అంటూ కౌంటర్లు వేస్తున్నారు..