29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Pawan Kalyan Vs Perni Nani : పవన్ కళ్యాణ్ కు చెప్పులు చూపించిన పేర్నినాని.. ఏపీ షాక్..

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan, perni nani

    Pawan Kalyan : వైసీపీ నేత పేర్ని నాని జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చాడు. పవన్ తన వాహనానికి ‘వారాహి’ అని అమ్మవారి పేరు పెట్టారని, ‘నరవాహి’ అని పేరు పెడితే బాగుంటుందన్నాడు. గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోకుండా పవన్ ఇష్టానుసారంగా వ్యవహస్తున్నాడని అభిప్రాయపడ్డారు. పవన్ నిరంతరం చెప్పులు చూపిస్తున్నారని, నేను కూడా నా రెండు చెప్పులు చూపిస్తానని మీడియా కెమెరా ముందు చూపించారు. ‘జాగ్రత్త పవన్! మీరు నలిగిపోతారు. నేను నా రెండు చెప్పులను మీకు చూపిస్తున్నాను. సినిమా డైలాగులు, అర్థం, పర్థం లేని కబుర్లు చెప్పకండి. మేం కూడా అలాగే చేయగలం’ అని పేర్ని నాని హెచ్చరించారు.

    ‘వారాహి’ యాత్రలో భాగంగా కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ బుధవారం వైసీపీ సర్కార్‌పై చేసిన విమర్శలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన లారీకి అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రతీ వ్యాఖ్య పచ్చి అబద్ధమని చెప్పారు. పవన్ చంద్రబాబు వ్యూహాలను నమ్మితే అసెంబ్లీకి వెళ్లేరని ఎద్దేవా చేశారు. బాబు కోసం ఇంత దిగజారుడు తనం వద్దన్నారు.

    తన సినిమాలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ పవన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాము అడ్డుకున్న ఒక్క సినిమా పేరునైనా చెప్పగలవా..? అంటూ సవాల్ విసిరారు. ‘అబద్దాలు ప్రచారం చేస్తే మక్కెలు విరిగిపోతాయంటూ’ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో గులాబీ జెండాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నది ఎవరని..? అక్కడ మంత్రి హరీశ్ రావు ఏపీని తిడుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

    ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ మంత్రి హరీశ్ రావు అవహేళన చేస్తే పవన్ ఆయనను ప్రశ్నించారా.? అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మీ సినిమాలు ఏమైనా దెబ్బతిన్నాయా..? అని పేర్ని పవన్ ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇలాగే అరాచకాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...