37.7 C
India
Saturday, April 27, 2024
More

    Adipurush Prabhas Marriage : తిరుపతిలో ఆ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. వెడ్డింగ్ పై నోరు విప్పిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

    Date:

    Adipurush Prabhas Marriage : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ చివరికి తన పెళ్లి గురించి మాట్లాడారు. ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ తెగ సంతోష పడుతున్నారట. ప్రభాస్ లెగసీని ముందుకు తీసుకువెళ్లే వారసుడి కోసం ఆయన ఫ్యాన్స్ ఎన్నిసార్లో పెళ్లి చేసుకోవాలని సజెస్ చేశారట. అయితే ఆయన ఆ మాటలను దాట వేస్తూ వస్తున్నారు. బహుబలి నుంచి ప్రభాస్ క్రేజ్ ఇండియాలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ ను, హాలీవుడ్ స్టార్ ను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ లీకులు కూడా వినిపించాయి. కానీ వాటిపై ఆయన ఎప్పుడూ స్పందించలేదు.

    ఇక బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2’లో గెస్ట్ గా వచ్చారు ప్రభాస్. ఈ షోలో ఆయనతో పాటు స్నేహితుడు గోపీచంద్ కూడా వచ్చారు. ఈ షోలోనైనా తన పెళ్లి గురించి చెప్తాడని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన ఎటువంటి లీకులు గానీ, విషయాలు గానీ ఇవ్వలేదు. అయితే ఇదే షోకు ఫోన్ చేసిన ప్రభాస్ ఫ్రెండ్ హీరో రాం చరణ్ మాత్రం కొంత లీక్ ఇచ్చాడు. అయినా అది పూర్తిగా ఎవరికీ అర్థం కాలేదు. పెళ్లి చేసుకోవాలంటూ బాలయ్య బాబు కూడా ప్రభాస్ కు సూచించారు. ఆయన సున్నితంగా జవాబు ఇచ్చారు.

    ఇవన్నీ పక్కన ఉంచితే తన పెళ్లి గురించి మంగళవారం (జూన్ 6) కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాస్. ‘ఆదిపురుష్’ ప్రీ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది వచ్చారు. ఈ సందర్భంగా ‘ప్రభాస్ మీ పెళ్లెప్పుడూ..?’ అంటూ ఫ్యాన్ ఈలలు వేస్తూ, గోలలు చేస్తూ అడిగారు. దీంతో ప్రభాస్ సమాధానం చెప్తూ.. ‘నా పెళ్లా..? ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటా.. ఎప్పుడైనా కవచ్చు..’ అని నవ్వుతూ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ తెగ సంబురపడి పోయారు. ఈలలు వేస్తూ గోల చేశారు. వారి కోసం ప్రభాస్ మరో తీపి కబురు కూడా చెప్పాడు. ఇక నుంచి ప్రతీ సంవత్సరం రెండు, మూడు సినిమాలు చేస్తానని చెప్పారు. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదల కాబోతోంది.

    Share post:

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Prabhas Wedding : ”ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది”.. క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ.. 

    Prabhas Wedding : పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికి...

    Adi Purush : ‘ఆది పురుష్’ రావణుడి తలలు అక్కడి నుంచే.. ఆధారం చూపుతున్న మూవీ టీమ్

    Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్...

    Kalki 2898 AD : కల్కి 2898 ఎడి విడుదల వాయిదా?

    Kalki 2898 AD ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898...