Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భామలు చాలా మంది ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి ఎవరైనా నచ్చితే వారిని తెగ అభిమానిస్తుంటారు.. అయితే ముద్దుగుమ్మలు మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగే వరకు టాలీవుడ్ ను ఉపయోగించుకుని ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేస్తారు. అక్కడ డబ్బుకు డబ్బు.. ఫేమ్ కు ఫేమ్ ఎక్కువుగా వస్తుంది..
దీంతో అక్కడికి ఎప్పుడు చెక్కేద్దామా అని ఎదురు చూసేవారే ఎక్కువ.. మరి అలా చెక్కేసిన భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఒకప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ బాలీవుడ్ పై మోజుతో అక్కడికి వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది..
తెలుగులో మెప్పించిన ఈ భామ తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. కానీ ఇక్కడ వరుస ఆఫర్స్ వస్తుండగానే బాలీవుడ్ కు చెక్కేసింది.. అయితే అక్కడ ఈమెను పెద్దగా పట్టించుకుంది లేదు. అక్కడ ఏ మాత్రం మెప్పించలేక ఇటు తెలుగులో స్టార్ స్టేటస్ కోల్పోయి కెరీర్ ను అయోమయ స్థితికి చేర్చుకుంది. అడపాదడపా అవకాశాలు మినహా పెద్ద అవకాశాలు అయితే రావడం లేదు..
ఇక అవకాశాలు లేకపోయిన రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది. తాజాగా సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి రకుల్ చీరలో మెరిసింది.. ఈ భామ చీరలో కూడా సొగసులు మొత్తం దాచుకోకుండా చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.. ఈ పిక్స్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram