Ranveer Singh :
రణ్ వీర్ సింగ్ అంటే తెలియని వారు లేరు.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఈయన ఒకరు.. చాలా తక్కువ సమయంలో రణ్వీర్ సింగ్ స్టార్ హీరోగా ఎదిగి బాలీవుడ్ లోనే టాప్ పొజిషన్ కు చేరిపోయాడు.. రణ్వీర్ సింగ్ దీపికా పదుకొణె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈయన కెరీర్ లోనే కాదు లైఫ్ లో కూడా సెటిల్ అయ్యాడు..
బాలీవుడ్ లో ఈ స్టార్ కపుల్ జంట ప్రెజెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. పెళ్లి తర్వాత మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపు తున్నారు.. ఇదిలా ఉండగా రణ్వీర్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె పెళ్ళికి ముందే చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇలా నటిస్తున్న క్రమంలోనే వీరి ప్రేమలో పడి సహజీవనం చేసి అప్పుడు పెళ్లి చేసుకున్నారు.. మరి పెళ్ళికి ముందు వీరు నటించిన సినిమాల్లో బాజీరావు మస్తానీ ఒకటి.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, దీపికా రొమాన్స్ అందరిని ఆకట్టుకుంది.
అప్పటికే ఈ జంట లవ్ లో ఉండడంతో రొమాన్స్ తో రెచ్చిపోయారు. ఈ సినిమా కిస్ సన్నివేశం గురించి ఈయన మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశం జరుగుతుండగా షూటింగ్ టైమ్ లో ఆపుకోలేక నిజంగానే ముద్దులు పెట్టుకున్నాం” అంటూ రణ్వీర్ సింగ్ తెలిపాడు. డైరెక్టర్ కట్ అని చెప్పినా మేము పట్టించుకోకుండా ముద్దును కొనసాగించాం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ReplyForward
|