Rashmika Mandanna : రష్మిక మందన్నను డీప్ ఫేక్ వదలడం లేదు. డీప్ ఫేక్ మూలంగా ఇండస్ట్రీలో ఎక్కువ ఇబ్బంది పడింది రష్మిక మందన్న మాత్రమే అని చెప్పవచ్చు. గతంలో నల్లటి దుస్తులు ధరించిన తన మొదటి డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత, మరో సారి మానిప్యులేషన్‌కు బలైంది. ఇప్పుడు మరో సారి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
డీప్ ఫేక్ టెక్నాలజీ సెలబ్రిటీలకు శాపంగా మారింది. ఈ కొత్త టెక్నాలజీని చాలా వరకు చెడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు కొందరు వైరల్ రాయుళ్లు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోల వల్ల సెలబ్రిటీలు టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు.
రష్మిక మందన్నతో పాటు కాజోల్, కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ కు బలయ్యారు. దీంతో అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ వీడియోలను సృష్టించి, సర్క్యులేట్ చేస్తున్న నిందితులను పట్టుకొని చట్ట పరమైన శిక్షలు అమలు చేస్తున్నారు.
ప్రభుత్వం, భద్రతా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ఫేక్ సెలబ్రిటీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. రష్మిక డీప్ ఫేక్ వీడియో విషయంలో, డ్యాన్స్ చేస్తున్న యువతి ముఖం ఎడిట్ చేశారు. దీనికి రష్మిక ఫేస్ జోడించారు. ఇలాంటి వీడియోలు పెట్టవద్దని రష్మిక అభిమానులు ఇతరులను కోరుతున్నారు.
View this post on Instagram