- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
RBI Governor
RBI Governor : రూ. 2000 నోట్ల ఉపసంహరణ తర్వాత దేశంలో ఆర్థిక పరమైన అల్లకల్లోలం నెలకొంది. దీనిపై ప్రతీసారి ఏదో ఒక విధమైన వార్తలు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రూ. 2000 నోట్లు ఎవ్వరూ తీసుకోవద్దని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో చాలా మంది దుకాణాదారులు, వ్యాపార సముదాయాల్లో రూ. 2 వేల నోట్లను తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు తీవ్రమైన అసహనానికి గురవుతున్నారు.
రూ. 2వేల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. అయితే చాలా కాలం నుంచి ఆర్బీఐ ఆ పరిధిలోని బ్యాంకులు కూడా రూ. 2వేల నోట్లను వాడక నుంచి తగ్గించుకుంటూ వాచ్చారు. ఇప్పుడు మార్కెట్లో ఈ నోట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ చెలామణి నుంచి ఉప సంహరణ అని చెప్పడంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్తున్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఒక వేళ మీ వద్ద రెండు వేల నోట్లు ఉంటే సంబంధిత బ్యాంకులో మీ ఖాతాలో వేసుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు రూ. 20వేల వరకూ మార్చుకోవచ్చని అంతకంటే ఎక్కువ అయితే పాన్ కార్డ్ చూపించాలని చెప్పారు.
అయితే రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ప్రకటన చేశారు. సెప్టెంబర్ తర్వాత రూ. 20వేల నోట్లు చెల్లవని చెప్పలేదని వెల్లడించారు. దీంతో ప్రజలు మరోసారి గందర గోళానికి గురయ్యారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి కామెంట్లు చేయలేదు ఆయన. బ్యాంకులకు మాత్రం రూ. 2000 నోట్లను ఖాతాదారులకు, వినియోగదారులకు ఇవ్వద్దని ఆయన ఇప్పటికే ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా ప్రకటన గందరగోళానికి గురి చేసిందని దేశ వ్యాప్తంగా మండిపడుతున్నారు.