RBI Key decision : దేశంలోని బ్యాంకులన్నింటికి రిజర్వ్ బ్యాంకు కేంద్రంగా ఉంటోంది. వాటిని సమన్వయం చేసి వాటిని గాడిలో పెడుతుంది. రుణాలు చెల్లించడం, కొనసాగించడం తదితర చర్యలకు అనుసంధానంగా వ్యవహరిస్తుంది. దేశంలోని బ్యాంకులన్ని సక్రమంగా పనిచేసేందుకు మార్గం సుగమం చేస్తుంది. సాధారణంగా మనం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేస్తుంటాం.
వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకోవాలంటే కూడా ఆంక్షలు విధించేది రిజర్వ్ బ్యాంకే. రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకే ఇచ్చిన రుణాలకు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ వేగంగా పెరుగుతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వ్యక్తిగత రుణాలు రూ.33 లక్షల నుంచి కోటి 40లక్షల కోట్ల వరకు పెరిగాయి.
గత ఏడాది కంటే ఈ ఏడాది 20 శాతం పెరిగాయి. పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం మధ్య అన్ సెక్యూర్డ్ క్రెడిట్ పెరగడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు సృష్టించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ తీసుకున్న వారిపై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. బ్యాంకుల్లో కూడా మార్పులు చేస్తోంది.
ఇలా ఆర్బీఐ సూచనలతో బ్యాంకులు వినియోగదారులపై వడ్డీ రేట్లు పెంచడంతో ఈఎంఐలు కట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆర్బీఐ నిబంధనల వల్ల వినియోగదారులకు భారం పెరగనుంది. ఇప్పటికే పెరిగిన వడ్డీ రేట్లతో సతమతమవుతున్న నేపథ్యంలో కొత్తగా వడ్డీ రేట్లు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి.