- ఇప్పటికే డీసీసీల నియామకం పూర్తి తర్వాత వారే..

Revanth Sena : కర్ణాటకతో మొదలు పెట్టిన గెలుపును తెలంగాణతో కొనసాగించాలని రేవంత్ సేన యోచిస్తోంది. అందుకు కార్యాచరణ కూడా సిద్దం చేసింది. పార్టీలోని ప్రముఖ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అందుకు నాయకులు, పార్టీ ప్రముఖులతో రేవంత్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వేగంగా పెండింగ్ పోస్ట్ లను భర్తీ చేస్తే పార్టీ శ్రేణులు వారి ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా పని చేస్తాయని అధిష్టానం భావిస్తోంది.
వచ్చే నెలలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణకు రానున్నారు. అప్పటి వరకే కార్యవర్గాలు మొత్తం పూర్తి చేసి వారికి ఆయా బాధ్యతలను కూడా అప్పటించాలని భావిస్తుంది అధిష్టానం ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న డీసీసీల నియామకం పూర్తి చేసింది. ఇక త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించాలని చూస్తోంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణకు రానున్నారు. ఆ తర్వాత సోనియా, రాహుల్ వస్తారు. అప్పటి వరకూ వరకూ పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీలైనంత వరకూ కర్ణాటక కార్యవర్గం సేవలను వాడుకోవాలని రేవంత్ సేన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇంత భారీ విజయం ఎవరూ ఊహించలేదు. ఈ విజయంతో తెలంగాన కాంగ్రెస్ కేడర్ ఉత్సాహంగా ఉంది. కానీ బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే మరింత కష్టపడాల్సి వస్తుందని కేడర్ భావిస్తోంది. అందుకు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని రేవంత్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీలో టాక్ వినిపిస్తుంది. రాహుల్, సోనియా సభలను భారీ ఎత్తున విజయవంతం చేస్తే రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చని స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ కూడా జూన్ మొదటి వారంలో హైదరాబాద్ కు వస్తున్నట్లు పార్టీ నాయకుల నుంచి టాక్ ఉంది.