
Revanth Zoom Meeting : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరింత జోరు పెంచారు. పార్టీని ఎలాగైనా ప్రభుత్వంలోకి తీసుకురావాలని అందుకు ప్రతీ చాన్స్ ను వినియోగించుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక గెలుపును చూసిన ఆయన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను గెలిపించాలని పట్టుతో ఉన్నారు. కేడర్, నాయకులను ఉత్తేజ పరుస్తూ అందరినీ కలుపుకుంటూ పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు.
ఇందులో భాగంగా జూన్ లో రాష్ట్రానికి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తీసుకురావాలని చూస్తున్నారు. అందుకు వేదిక, సభ కూడా కన్ఫమ్ చేసినట్లు తెలిసింది. ఇక గాంధీ కుటుంబం కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ రాకపోకలు సాగించాలని, వీలైతే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటుంది. కర్ణాటకలో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ అక్కడి కేడర్ సలహాలు, సూచనలను ఇక్కడి కేడర్ వినియోగించుకోవాలని అనుకుంటుంది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి కూడా నాయకులకు పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి లోకల్ తో పాటు ఎన్ఆర్ఐలపై కూడా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. వారి సేవలను కూడా ఈ సారి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. ఎన్ఆర్ఐలలో చాలా మంది కాంగ్రెస్ అభిమానులు ఉన్నారని ఆయనకు తెలుసు అక్కడి వారితో ఇక్కడి వారిని మోటివేషన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎన్ఆర్ఐలతో జూమ్ మీటింగ్ నిర్వహించాలని అనుకుంటున్నారు. దాని కోసం ఆదివారం ఉదయం 9.30 గంటలకు యూఎస్ఏ ఎన్ఆర్ఐలతో సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన సలహాలు, సూచనలను వారి నుంచి తీసుకునేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.