
Sai Pallavi Role in Devara : ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుసగా హిట్లు సాధిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ తన 30వ సినిమాగా దేవర చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర సినిమాపై ఉత్కంఠ నెలకొంది.
ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దీంతో సినిమాపై సాధారణంగా అంచనాలు పెరగడం సహజమే. దేవర సినిమా షూటింగ్ నిరంతరంగా కొనసాగుతోంది.
దేవర షూటింగ్ ను గత మార్చి నెలలోనే ప్రారంభించారు. నాలుగు యాక్షన్ షెడ్యూళ్లను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. టాకీ పార్ట్ ను పూర్తి చేయాలని భావిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సముద్రభాగం బ్యాక్ డ్రాప్ లో వస్తుందని చెబుతున్నారు. సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలుంటాయని మాత్రం చెబుతున్నారు.
ఇందులో మరో హీరోయిన్ ఉంటుందంటున్నారు. మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి తో సహా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రం యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో సాయిపల్లవి కనిపిస్తుందని తెలిసింది. ఈ రోల్ సహజంగా ఉంటుందట.