29.9 C
India
Saturday, April 27, 2024
More

    సీనియర్ నటుడు శరత్ బాబు పరిస్థితి విషమం..!

    Date:

    actor sarath babu hospitalized
    actor sarath babu

    సత్యం బాబు దీక్షితులు స్క్రీన్ నేమ్ శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనకు ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తుందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. కిడ్నీ ఫెయిల్ తో పాటు లంగ్స్ డిసీజ్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యరు శరత్ బాబు.

    31 జూలై, 1951లో జన్మించారు సత్యంబాబు దీక్షితులు. ఆయన తమిళ, తెలుగు సినిమాల్లో ప్రధానంగా నటించారు. ఇప్పటి వరకూ ఆయన 200 చిత్రాలకుపైగా నటించారు. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు మాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు సైతం ఆయన తన సేవలను అందించారు. 1973లో ‘రామరాజ్యం’ అనే తెలుగు సినిమాతో ఆయన వెండితెరపై అడుగుపెట్టాడు. ఈ సినిమా ఆయనకు అంతగా కలిసి రాలేదు. తర్వాత ప్రఖ్యాత తమిళ దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ‘నిజల్ నిజమగిరదు’తో ఆయన స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ ఆయన ఎనిమిది నందీ బహుమతులు అందుకున్నారు.

    శరత్ బాబు తండ్రి ఓ హోటల్ వ్యాపారి. ఆయన తదనంతరం హోటల్ బాధ్యతలు శరత్ బాబు నిర్వహించాలని అనుకున్నాడు. కానీ శరత్ బాబుకు మాత్రం పోలీస్ కావాలనే కల ఉండేది. దీనికి అనుగుణంగా ఆయన శ్రమించాడు. కానీ ఆయన కంటి చూపు బాగా లేకపోవడంతో పోలీస్ ఉద్యోగం రాలేదు. ఇక సినిమాల్లోకి వెళ్లాలని తన తల్లి మాత్రం కోరుకునేది దీంతో ఆయన ఆ దిశగా శ్రమించడం మొదలు పెట్టారు. కే బాలచందర్ సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలో ఆయన కాలుపెట్టారు. శరత్ బాబు హీరోగా కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించారు. చాలా వరకు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. కొన్నింటిలో విలన్ గా కనిపించారు ఆయన. శరత్ బాబు సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా అలరించారు. దూరదర్శన్ లో తాను చాలా ధారావాహికలో నటించారు. తమిళం, తెలుగు కన్నడ సీరియల్స్ లలో ఆయన నటించి మెప్పించారు.

    శరత్ బాబు తనకన్నా నాలుగేళ్ల పెద్దదైన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇదొక సంచలనం అయ్యింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. దాదాపు 14 సంవత్సరాలే వీరు కలిసి జీవించారు. తర్వాత రమాప్రభతో విడాకులు తీసుకున్నారు శరత్ బాబు. తర్వాత స్నేహ నంబియార్ ను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా దాదాపు 21 సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉన్నా. సదరు మహిళ ఎవరూ అనేదానిపై ఇప్పటికీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramaprabha : శరత్ బాబును కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రమాప్రభ.. ఇంకా ప్రేమ చావలేదంటూ.. 

    Ramaprabha : వెటరన్ నటుడు శరత్ బాబు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.....

    Sarath Babu Last Desire : చివరి కోరిక తీరకుండానే మరణించిన శరత్ బాబు.. ఏంటంటే..?

    Sarath Babu last desire : 1951లో జన్మించిన శరత్ బాబు...

    Sarath Babu no more : శరత్ బాబు ఇకలేరు.. శోకసంద్రంలో టాలీవుడ్.. ఆయన నట ప్రస్థానం ఇదీ

    Sarath Babu no more : అందానికి అందం.. రూపానికి రూపం.....