balagam : మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాచేసిన తిరువీర్ మసూదతో హీరోగా మారాడు. మల్లేశం, ఘాజీ, పలాస, జార్జిరెడ్డి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ‘మసూద’ లాంటి హరర్ జానర్ లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. పల్లెటూరి సరదా డ్రామా ‘పరేషాన్’తో మరోసారి వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సోనీ లివ్ లో అందుబాటలో ఉన్న ఈ సినిమా గురించి తెలుసుకుందాం.
సమర్పణ్(మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతడి కొడుకు ఐజాక్ (తిరువీర్) పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. కొడుకుకు తన ఉద్యోగం అప్పగించాలని అనుకుంటాడు సమర్పణ్. ఇందుకు లంచంగా రూ. 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. డబ్బు దొరికిందా? అధికారులకు ఇచ్చాడా? మధ్యలో ఐజాక్ ఎదుర్కొన్న పరిస్థితులేంటి? దీనికి తోడు అతడి గర్ల్ ఫ్రెండ్ గర్భవతి అని తెలుస్తుంది. డబ్బు, గర్ల్ ఫ్రెండ్ చుట్ట కథ నడుస్తుంది.
బలగం సినిమాలో లాగానే తెలంగాణ నేటివీటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ కథలో కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. కుదురుగా ఉండని కొడుకు, అతన్ని తిట్టే తండ్రి మధ్యలో ప్రేమ. ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఫన్ జనరేట్ చేసినా కథ బాగా లేకపోవడం మైనస్‌గా మారింది. సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సినిమాలో తిరువీర్ నటనను మాత్రం మెచ్చుకోవచ్చు. శిరీష పాత్రలో పావని కరణం ఆకట్టుకుంది. అర్జున్ కృష్ణ, రవి, బన్ని అభిరామ్ కూడా తమ పాత్ర మేరకు నటించారు. వాసు పెండమ్ సినిమాటో గ్రఫీ అద్భుతం. థియేటర్లలో యావరేజ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.