SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్ అంటే కేవలం కనులు, మనసులో ఉండే ఫీలింగ్ మాత్రమే. రాను రాను ఆ సంస్కృతి మారుతూ వచ్చింది. టెక్నాలజీ పుణ్యమా? లేక ప్రాశ్చత్య కల్చర్ ఒంటికి పట్టించుకున్నామా? తెలియదు గానీ అర్థం మాత్రం మారుతోంది. ప్రేమలో ఉన్న జంట చేతులు కలుపుకునేందుకు సంవత్సరాలు పట్టేది. ఒకరి శరీరం గురించి మరొకరికి అస్సలు తెలిసేది కాదు. చేతులు తాకేందుకే సంవత్సరాలు పడితే శరీరం గురించి ఎలా తెలుస్తుంది కదా? కానీ నేటి జనరేషన్ అలాకాదు.
ఇప్పటి ప్రేమ కన్నుల నుంచి కాకుండా శరీరం నుంచే మొదలవుతుంది. నిన్న ప్రేమించుకుంటున్నాం అని ప్రపోజ్ చేసుకున్న జంట ఈ రోజు సెక్స్ చేసుకునేందుకు అస్సలు ఆలోచించడం లేదు. సెక్స్ అనేది ఆనందంలో మునిగి తేలే శారీరక అవసరంగా మాత్రమే చూస్తున్నారు. దీంతో కన్సివ్ కావడం.. ఇద్దరి మధ్యా బ్రేకప్ ఇలా చాలా సమస్యలు తలెత్తి ఇవి కాస్తా చివరికి సూసైడ్ల వరకు దారి తీస్తుంది. సరే.. ఇవంటే సాటుకు జరిగే చర్యలు కానీ. పార్కుల్లో ప్రేమ పేరుతో జంటలు చేసే పనులు చేస్తే జుగుప్సా కలగకమానదు. వీటిపై పోలీసులకు అడపా దడపా ఫిర్యాదులు వెళ్తూనే ఉంటాయి.
దీంతో, షీ టీం రంగంలోకి దిగింది. పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో అనైతిక చర్యలకు పాల్పడుతున్న జంటలకు షాక్ ఇచ్చింది. ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణకాంత్ పార్కుతో పాలు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో వారి ప్రవర్తనతో ఇబ్బంది కలిగిస్తున్న జంటల్లో 12 జంటలను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బహిరంగ ప్రదేశాల్లో లవ్ పేరుతో ఇతరులకు ఇబ్బంది కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.