Srimukhi & Avinash :
యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ లేరు.. అగ్ర యాంకర్ గా అన్ని ఛానెల్స్ చుట్టేస్తున్న ఈ భామ చేస్తున్న షోలు మరో యాంకర్ చేయడం లేదు.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత బాగా రాణిస్తుంది.
ఇక ఈమె ఇప్పుడు ఏకంగా అరడజను షోలు చేస్తూ ఎక్కడ చూసిన శ్రీముఖినే కనిపిస్తుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ హడావిడే అని చెప్పాలి.. ఎప్పుడు ఫుల్ ఎనర్జిటిక్ గా జోష్ గా యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంది.. షోలు, ఈవెంట్స్ ఏవైనా శ్రీముఖి హడావిడే వేరు.. ఇక ఈమె స్టార్ మా పరివారం అనే షో కూడా చేస్తుంది.
మరి తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ కాగా ఈ కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.. సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన బుల్లితెర స్టార్స్ ఇందులో రాగా ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగింది.. ఈ ఎపిసోడ్ రెట్రో థీమ్ తీసుకోవడంతో ముక్కు అవినాష్ కూడా ఆ టైప్ కాస్ట్యూమ్స్ లో వచ్చాడు.
శ్రీముఖి, స్టార్స్ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ మాములు రచ్చ చేయలేదు.. ఈ క్రమంలోనే శ్రీముఖి అవినాష్ చెంప చెళ్లుమనిపించింది.. శ్రీముఖి డైలాగ్ చెబుతూ పార్ధు ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్ట్ కలర్ పట్టుకోగా అవినాష్ రెచ్చిపోయి ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాడు.. కానీ ఈమె ఒక్కసారికి చెంప చెళ్లుమనిపించింది. ఈమె సరదాగా కొట్టాలని అనుకున్న సౌండ్ బాగా రావడంతో ఆ సౌండ్ కు అంతా షాక్ అయ్యారు. ఈ ప్రోమో ఆద్యంతం అలరిస్తుంది.
ReplyForward
|