Amit Shah : సిఏఏ అమలు చేయమని కేరళ, తమిళనాడు ,బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్య లు చేశారు.
సీఏఏ కేంద్ర పరిధిలోని అంశమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం కేంద్రానికి పౌరసత్వం పై నిబం ధనలు రూపొందించే అధికారాన్ని కల్పిస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రా లు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు దుష్ప్ర చారం చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. సి ఏ ఏ చట్టాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
ఈ చట్టం కొందరికి వ్యతిరేకంగా ఉందని అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటేనే ఆ చట్టం దేశవ్యాప్తంగా అమలు అవుతుందని ఆయా రా ష్ట్రాల ముఖ్యమంత్రిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.