America New Jersey స్వాతంత్య్ర వేడుకలు మన దేశంలో ఎంత గ్రాండ్ గా జరుగుతాయో మనందరికీ తెలిసిందే. అయితే మన దేశంలోనే కాకుండా అటు అమెరికాలో కూడా ఈ వేడుకలను అక్కడి మన ఎన్నారై సంఘాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతి ఏటా అమెరికాలోని న్యూ జెర్సీలో ఇండియా డే పరేడ్ ను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆగస్టు 13న ఆదివారం రోజున భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ ను నిర్వహించబోతున్నారు. కాగా ఈ పరేడ్ వేడుకకు స్టార్ హీరోయిన్ తమన్నా ముఖ్య అతిథిగా రాబోతోంది. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించబోతున్నారు. ఓక్ ట్రీ రోడ్ లో ఈ పరేడ్ జరగబోతుంది. ఇది తమన్నాకు అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి.
ఈ వేడుకలకు గతంలో కూడా ఇలా సెలబ్రిటీలను ఆహ్వానించారు. కానీ తమన్నాకు ఇలాంటి పరేడ్ లో పాల్గొనే అవకాశం రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన జైలర్ సినిమా ఈ రోజు విడుదల అయింది. రేపు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన భోళా శంకర్ సినిమా కూడా రాబోతోంది.
దాంతో మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస మూవీలతో బిజీగా మారిపోయింది తమన్నా. అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.