
Venu Swami astrology : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వారికంటే ఎక్కువ సెలబ్రిటీ అవుతున్నారు వేణు స్వామి. ఈయన ఇప్పటి వరకూ చెప్పినజాతకాలు చాలా వరకు కరెక్టర్ కావడంతో ఎక్కువ మంది ఆయన జాతకాన్ని నమ్ముతుంటారు. పరిహారం ఏంటి..? ఏ పూజలు చేయించుకుంటే ఈ దోషం పోతుంది అంటూ ఆయనతో పరిహార పూజలు కూడా చేయించుకుంటారు. హీరోయిన్లు రష్మిక మందన, నిధి అగర్వాల్ వీరితో పాటు మరికొందరు వేణు స్వామి జాతకాన్ని నమ్మి పరిహారం పూజలు చేసుకున్న వారిలో ఉండగా, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా కూడా మారాయి. వీరితో పాటు చాలా మంది పరిహార పూజలు చేయించుకున్నారు. కానీ వారెవరి గురించి బయటకు పొక్కలేదు.
వేణు స్వామి మాటలు మొదట్లో ఎవరూ నమ్మేవారు కాదు. చైతూ-సామ్ జోస్యంతో ఈయన మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే త్వరలోనే విడిపోతారని చెప్పారు. కానీ అవేవీ పట్టించుకోకుండా వారు వివాహం చేసుకొని చివరికి విడాకులు కూడా తీసుకున్నారు. అనుష్కకు, రకుల్ కు కడూ పెళ్లి బంధం అంతగా కలిసి రాదని కూడా చెప్పాడు వేణు స్వామి. నయనతార పెళ్లి తర్వాత చిక్కులో పడుతుందని అవి విడాకుల వరకూ దారి తీస్తాయని కూడా చెప్తూ హెచ్చరిస్తున్నాడు. రష్మిక పెళ్లిని పక్కన పెడితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారుతుందని చెప్పింది కూడా వేణుస్వామినే. ఆయన చెప్పినట్టే రష్మిక వివాహాన్ని క్యాన్సిల్ చేసుకొని మరిన్ని పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది.
ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం తాజాగా ఒక యాంకర్ విషయంలో వేణు స్వామి చెప్పింది ఖచ్చితంగా నిజం అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ యాంకర్ ఎవరంటే వర్షిని. మొదట్లో డీ జోడీలో ఆదితో కలిసి ఈ ముద్దుగుమ్మ చేసిన హడా విడి అంతా ఇంతా కాదు, దీంతో పాటు షోలు, ఈవెంట్లు చేస్తూ బిజీగానే ఉంది వర్షిణి.
యాంకర్ వర్షిణి పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దానికి కారణం ఈ మధ్య ఈమె క్రికెట్ స్టేడియంలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం. ఆమె తరుచూ క్రికెట్ చూసేందుకు వెళ్లడం వెనుక ఒక సీక్రెట్ లవ్ స్టోరీ ఉందట. వాషింగ్టన్ సుందర్ యహోతో ఆమె ప్రేమయానం కొనసాగిస్తుందని.. వీురు లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారిన వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వర్షిణి ఇండియాలోనే ఫేమస్ అవుతుందని, ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో వేణు స్వామి జోతిష్యం ఫలిస్తుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి మరి.