Jhanvi Kapoor :
శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఆశించినంత రాణించడం లేదు. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను విచ్చలవిడిగా ఆరబోసి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో పాటు తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ను కొట్టేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నేరుగా ఈ సినిమా ద్వారానే అడుగుపెడుతుంది జాన్వీ కపూర్. రీసెంట్ గా మీడియా మీట్ లో మాట్లాడిన జాన్వీ సౌత్ సినిమాల్లో ఎందుకు ఎంట్రీ ఇచ్చానో చెప్పుకచ్చింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ‘కేవలం నార్తే కాదు సౌత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సౌత్ ఇండస్ట్రీ తనకు సొంత ఇంటి లాంటిది అనిపిస్తూ ఉంటుంది. సొంత ఇంటికి వచ్చిన ఫీలింగే ఉంటుంది. అంతేకాదు, నాకు సౌత్ జనాల నుంచి అపారమైన ప్రేమ, అభిమానం లభిస్తుందని నమ్మకంగా ఉన్నా. అందుకే సౌత్ ను కూడా ఇంటి లాగే భావిస్తూ ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. ఎప్పుడైనా హైదరాబాద్ కి వచ్చి వెళ్తే.. ఇంటికి వచ్చి వెళ్లాను అన్న ఫీలింగ్ కలుగుతుంది.’ అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
ఇది విన్న సౌత్ జనాలు జాన్వీ బిస్కెట్లు వేయడం నేర్చుకుందని కామెంట్లు పెడుతున్నారు. ఆమె ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న ‘దేవర’ సినిమా హిట్ అవ్వడానికి ఇలాంటి కబుర్లు చెబుతుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొరటాల యంగ్ టైగర్ కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా మారాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని ఇండస్ట్రీ కూడా నమ్ముతోంది. ఈ సినిమా హిట్ అయితే జన్వీకి సౌత్ లో మంచి మార్కెట్ ఓపెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.